దారుణం: రూట్ చెప్పలేదని యువతిపై కారెక్కించాడు
మెల్బోర్న్: మన దేశంలోనే కాక, విదేశాల్లోనూ ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల వింత, వికృత ప్రవర్తనతో ఉబెర్ సంస్థకు తలనొప్పులు తెచ్చి పెడుతోంది.
తాజాగా ఆస్ట్రేలియాలో ఉబెర్ క్యాబ్ డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. క్వీన్స్‌ల్యాండ్‌కి చెందిన సచ్చా పొంగాలో అనే ఓ యువతి ఎప్పటిలాగే క్యాబ్ బుక్ చేసుకుంది. కారెక్కి తాను వెళ్లాల్సిన చోటు చెప్పింది.
అయితే జీపీఎస్‌లో ఆ వివరాలు నమోదు చేయాల్సిన డ్రైవర్ అందుకు అంగీకరించలేదు. అంతేగాక, రూట్ వివరాలు ఆమే చెప్పాలని పట్టుబట్టాడు. సరేనన్న ఆమె ఎప్పటికప్పుడు మార్గం చెప్తుండగా కారు ముందుకెళుతోంది.

ఇంతలో ఆ యువతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోను మాట్లాడుతూ.. కారు వెళ్లాల్సిన మార్గం చెప్పకపోవడంతో క్యాబ్ డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంతో అరిచాడు. అంతటితో ఆగకుండా ఆమెను కారు నుంచి బయటికి తోసేసి ఆమెపై నుంచి కారు చక్రం పోనిచ్చాడు.
దీంతో మహిళ కాలు కారు చక్రం కింద నలిగిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను ఇన్ని రోజులూ క్యాబ్‌లలో ప్రయాణిస్తున్నా ఇలాంటి ఘటన మాత్రం ఎప్పుడూ జరగలేదని బాధితురాలు సచ్చా పొంగాలో.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications