విమానం హైజాక్?: తాగుబోతు వీరంగం వల్లే లాండింగ్

మెల్బొర్న్: మలేషియా విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో విమానం హైజాక్‌కు గురైందనే వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానం హైజాక్ అనుమానాలతో అత్యవసరంగా ఇండోనేషియాలోని బాలి ద్వీపంలోని డెన్‌పసార్ ఎయిర్ పోర్టులో దిగింది. బ్రిస్బేన్ నుంచి బాలి వెళ్లాల్సిన ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే ఆ విమానాన్ని బాలిలో దించేశారు. అయితే ఇదంతా ఓ తాగుబోతు చేసిన హంగామా వల్ల జరిగిందని అధికారులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నుంచి ఇండోనేషియాలోని బాలికి వస్తున్న వర్జీనియా విమానం కాక్ పిట్‌లోకి చొచ్చుకుని వెళ్లాడు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి. దీంతో ఆందోళనకు గురైన పైలట్ విమానాన్ని బాలి ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా లాండ్ చేశాడు. విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని అధికారులకు సమాచారం ఇచ్చాడు.

 Australian plane makes emergency landing over hijack scare

దీంతో హుటాహుటిన విమానం వద్దకు చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. బ్రిస్బేన్ నుంచి బాలి వచ్చిన 737 విమానాన్ని సైన్యం స్వాధీనం చేసుకుందని ఇండోనేషియా వైమానిక దళ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

కాగా, వర్జిన్ ఎయిర్ లైన్స్ హైజాక్ వార్తను ఖండించింది. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు విమానం కాక్ పిట్ లోకి ప్రవేశించి గొడవ చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వర్జిన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+