వైదొలిగిన టోనీ: ఆస్ట్రేలియా కొత్త పీఎంగా మాల్కోమ్

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌.. సోమవారం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య పదవిని కోల్పోయారు. అంతర్గత పార్టీ ఎన్నికల్లో సమాచార ప్రసారశాఖ మంత్రి మాల్కోమ్‌ టర్న్‌బుల్‌ విసిరిన సవాలుకు టోనీ తలొగ్గారు. దేశానికి 29వ ప్రధాన మంత్రిగా టర్న్‌బుల్‌ బాధ్యతలు మంగళవారం స్వీకరించనున్నారు.

సోమవారం రాత్రి హడావుడిగా లిబరల్‌ పార్టీ అధినాయకత్వం కోసం నిర్వహించిన ఎన్నికల్లో 57 ఏళ్ల అబాట్‌కి 44 ఓట్లు రాగా.. 60 ఏళ్ల టర్న్‌బుల్‌ 54 ఓట్లను కైవసం చేసుకున్నారు. టర్న్‌బుల్‌ విజయం.. మాజీ ప్రధాని జూలియా గిల్లార్డ్‌ తిరుగుబాటును గుర్తుచేసింది. ఆమె 2010లో కెవిన్‌ రూడ్‌పై సవాల్‌ చేసి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

టర్న్‌బుల్‌ బాధ్యతలు తీసుకుంటే గత ఐదేళ్లలో ఐదో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది. ఈ ఎన్నికల్లో పార్టీ ఉపాధ్యక్షులుగా జూలీ బిషాప్‌నే కొనసాగించాలని లిబరల్‌ ఎంపీలు నిర్ణయించారు. గవర్నర్‌ జనరల్‌కు అబాట్‌ రాజీనామా సమర్పించిన అనంతరం టర్న్‌బుల్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Australian PM Tony Abbott ousted by Malcolm Turnbull

కాగా, సోమవారం మధ్యాహ్నం మంత్రి పదవికి టర్న్‌బుల్‌ రాజీనామా చేస్తూ.. అధినాయకత్వం కోసం సవాలు చేయనున్నట్లు ప్రకటించారు. దేశ అవసరాలకు సరిపడే ఆర్థికపరమైన నాయకత్వాన్ని అందించే సామర్థ్యం అబాట్‌కి లేదని ఆయన విమర్శించారు. ఈ విషయంలో మిగతా మంత్రుల్లో ఎలాంటి లోపాలులేవని వివరించారు.

ఇది ఇలా ఉండగా, టోనీ అబ్బాట్ మంగళవారం ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. తమ ప్రభుత్వం లోపాలు ఏమి లేవని, నిర్లక్ష్యం ఏమి లేదని అన్నారు. ఏదేమైనా ఆస్ట్రేలియా ప్రజలు తనకు సేవ చేసే అవకాశం ఇవ్వడం ఆనందాన్నిచ్చిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+