మహిళ బాధ: యాంకర్‌కు కన్ను గీటిన ఆస్ట్రేలియా పిఎం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బట్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్ట్ కార్పొరేషన్(ఏబిసి) రేడియో స్టేషన్‌లో ఫోన్-ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న అబ్బట్ ఓ మహిళ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు యాంకర్ వైపు చూస్తూ కొంటెగా కన్ను గీటారు.
ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యల వల్ల తమ బతుకు దుర్భరమైందని చెబుతూ ఓ 67 ఏళ్ల మహిళ తన కష్టాలను వెల్లబుచ్చుకుంది. తాను పొట్ట నింపుకునేందుకు ఫోన్ సెక్స్ ఉద్యోగం చేయాల్సి వస్తోందని తెలిపింది. ఆ మాట వినగానే టోనీ అబ్బట్ యాంకర్ వైపు చూస్తూ కన్ను గీటారు.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్‌లో హల్ చల్ చేస్తోంది. దీంతో ప్రధాని చేసిన కొంటే చేష్టపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళ తన బాధను చెప్పుకుంటుంటే.. అది అర్థం చేసుకోకుండా ఈ విధంగా స్పందించడంపై పలువురు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
ఆ వీడియోను చూసిన పలువురు సోషల్ మీడియాలో టోనీ అబ్బట్‍పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రధాని అబ్బట్‌కు ఈ ఘటనతో అంతర్జాలంలో తెగ ప్రచారం లభిస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications