రావల్పిండి జైలులో 2 వారాలుగా టాప్ సూపర్ మోడల్
లాహోర్: గత రెండు వారాలుగా రావల్ఫిండిలోని అడియాలా జైలులో 23 ఏళ్ల పాకిస్తానీ సూపర్ మోడల్ అయ్యాన్ అలీ ఉంటున్నారు. ఆమె జైలుకు వెళ్లినప్పటి నుండి పాకిస్తాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమె జైలులో అనుకూల పరిస్థితుల్లో నివసిస్తున్నారని తెలుస్తోంది.
గత నెల (మార్చి) 14వ తేదీన అయ్యాన్ అలీని ఇస్లామాబాద్ విమానాశ్రయంలో పోలీసులు మనీ లాండరింగ్ కేసు కింద అదుపులోకి తీసుకున్నారు. ఆమె సూటుకేసులో ఐదు లక్షల డాలర్లు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

అయితే, లీగల్‌గా ఓ వ్యక్తి పదివేల డాలర్లు మాత్రమే తీసుకు వెళ్లవచ్చు. కానీ ఆమె అంత మొత్తం కలిగి ఉండటంతో అధికారులు మనీ లాండరింగ్ కేసు కింద అదుపులోకి తీసుకున్నారు.
అయితే, తన పైన మనీ లాండరింగ్ కేసును సదరు సూపర్ మోడల్ తోసిపుచ్చారు. తనకు కస్టమ్స్ రూల్స్ తెలియవని, ఆ డబ్బుకు సంబంధించి అన్ని న్యాయపరమైన లెక్కలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఆ డబ్బు మనీ లాండరింగ్ కింద తీసుకుపోతున్నారని తెలిస్తే ఆమెకు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని లాయర్లు చెబుతున్నారు. మార్చి నెలాఖరున ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ దానిని కోర్టు డిస్మిస్ చేసింది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications