బాంబు పేల్చిన బాబా వంగా- మరింత భయానకం

ఆధునిక నోస్ట్రడామస్ గుర్తింపు పొందిన బాబా వంగా.. బాంబు పేల్చారు. 2025కి సంబంధించి ఇప్పటికే పలు ఆందోళనకరమైన అంచనాలను వెలువరించారు. ఇప్పుడు తాజాగా 2026కు సంబంధించి భవిష్యవాణిని వెల్లడించారు. ఇది- మరింత భయానకంగా ఉండబోవడం ఖాయంగా కనిపిస్తోంది.

2025లో తీవ్ర విపత్తులు, భారీ ప్రాణనష్టం గురించి వంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలు ఉన్నాయని, అంతర్జాతీయంగా అస్థిరత కొనసాగుతుందని గతంలో హెచ్చరించారు. దీనికి అనుగుణంగా రష్యాలో భారీ భూకంపాలు, అగ్నిపర్వతం బద్దలు కావడం, సునామీ సంభవించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Baba Vanga predictions on 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న వైఖరి వల్ల అంతర్జాతీయంగా అస్థిరత కూడా నెలకొంది. ఆయన ఇష్టారాజ్యంగా విధిస్తోన్న టారిఫ్స్.. భారత్ సహా పలు దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్- ఇరాన్ వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలూ తలెత్తాయి.

ఇప్పుడు 2026లో సంభవించబోయే విపరిణామాల గురించి ఆమె జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. ఇవి ఆందోళన కలిగిస్తోన్నాయి. రాబోయే సంవత్సరానికి ఆమె ఏం ఊహించారో, ఎందుకు ఇది కలవరం సృష్టిస్తుందనేది ఆయా అంశాలను బట్టి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ విపత్తులు..

2026లో బాబా వంగా శక్తివంతమైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేశారు. ఇవి మానవులకు, భూ గ్రహానికి హాని కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. భూమిలోని దాదాపు 7 నుండి 8 శాతం భూభాగం ఈ విపత్తులకు గురవుతుందని ఆమె పేర్కొన్నారు. ఇవి ఎలా మొదలవుతాయో స్పష్టంగా చెప్పలేదు గానీ.. ఇప్పటికే ప్రారంభ సంకేతాలు కనిపిస్తున్నాయని చాలామంది నమ్ముతున్నారు.

మూడో ప్రపంచ యుద్ధం..

బాబా వంగా అంచనాల ప్రకారం, 2026లో ప్రపంచ స్థాయి సంఘర్షణ చెలరేగే అవకాశం ఉంది. 2025లోనే భారతదేశం-పాకిస్తాన్, ఇరాన్-ఇజ్రాయెల్, థాయిలాండ్-కంబోడియా వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. వంగా జోస్యం ప్రకారం, పరిస్థితి మరింత తీవ్రతరం కావొచ్చు. చైనా తైవాన్‌పై దాడి చేయడానికీ అవకాశం ఉంది. రష్యా, అమెరికా మధ్య ప్రత్యక్ష ఘర్షణకు కూడా తలెత్తవచ్చు.

AI ఆధిపత్యం..

2026లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వృద్ధి గురించి కూడా బాబా వంగా జోస్యం చెప్పారు. 2025లో ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మనం చూస్తూనే ఉన్నాం. వేలాదిమంది ఐటీ నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. మానవ వనరులకు ఇది ప్రత్యామ్నాయంగా తయారైంది. బాబా వంగా అంచనా నిజమైతే- 2026 నాటికి ఏఐ మరింత పురోగమిస్తుంది. ప్రపంచాన్ని కమ్మేస్తుంది.

గ్రహాంతరవాసుల సంబంధం..

అదే సమయంలో ఏలియన్ల మీద కూడా బాబా వంగ తన అంచనాలను వెల్లడించారు. గ్రహాంతరవాసులు ఉన్నట్లు సాక్ష్యాధారాలు లభిస్తాయని ఆమె అంచనా వేశారు. అంతరిక్షంలో జీవ రూపాలను కనుగొనడం వంటి గొప్ప శాస్త్రీయ పురోగతికి ఇది నిదర్శనంగా మారుతుంది.

2026 నవంబర్‌లో ఒక భారీ గ్రహాంతర నౌక భూమి వైపు వస్తోందని, మానవులు మొదటిసారిగా గ్రహాంతరవాసులతో సంబంధం పెట్టుకోవచ్చని ఆమె జోస్యం చెప్పారు. ఇప్పటికే 3ఐ/ఎటిఎల్ఎఎస్ అనే ఒక ఖగోళ వస్తువు భూ వాతావరణాన్ని పోలివున్న విషయం తెలిసిందే. ఇది తోకచుక్క అని భావించినప్పటికీ.. హార్వర్డ్ ప్రొఫెసర్ లోబ్ దీన్ని కొట్టిపారేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+