వైన్ కోసం చిక్కుకున్న ఎలుగు బంటి (వీడియో)
రష్యా: అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగు బంటి ఓ ఇంటిలో వైన్ చోరి చేసి కిటికీలో చిక్కుకున్న సంఘటన తూర్పు రష్యాలో జరిగింది. అయితే ఎలుగు బంటి మరీ కష్టపడి నానా తంటాలు పడి ఇంటిలో నుంచి బయటపడి తప్పించుకుంది.
ఈ దృశ్యాలను ఇంటి యజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. తూర్పు రష్యా లో పీటర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చలి ఎక్కవగా ఉండటంతో అతను ఇంటి కిచెన్ లో వైన్ స్టాక్ పెట్టుకుని తాగుతున్నాడు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగు బంటి పీటర్ ఇంటిలో చొరబడింది.
కిచెన్ లో ఉన్న వైన్ చోరీ చేసింది. అదే సమయంలో ఇంటి యజమాని లోపలికి వెళ్లడంతో కిటికీలో నుంచి దూకి తప్పించుకోవాలని ఎలుగు బంటి ప్రయత్నించింది. అది వీలు కాకపోవడంతో నానా తంటాలు పడింది. చివరికి అదే కిటికీలో నుంచి తప్పించుకుంది.
ఇంటి యజమాని ఎలుగు బంటి దగ్గరకు వెళ్లకుండ జాగ్రతపడ్డాడు. చిన్న ఎలుగు బంటి అయినా సరే చాలా ప్రమాదకరమని అతను వీడియో తో పాటు ట్విట్ చేశాడు. అటవి శాఖ అధికారులు సైతం పీటర్ దగ్గరకు వెళ్లకుండా మంచి పని చేశాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications