నదిలో పడ్డ కారు, తల్లి మృతి.... 14 గంటల పాటు సజీవంగా ఓ చిన్నారి
ప్రమాదవశాత్తూ నదిలో పడ్డ కారులో, మృతి చెందిన తన తల్లిని చూస్తూ 18 నెలల చిన్నారి 14 గంటల పాటు కాలం గడిపింది. ఓ జాలరి అందించిన సమాచారంలో పోలీసులు ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే... బ్రిడ్జ్‌పై నుంచి కారు ఉతా నదిలోకి పడిపోగా, కారు నడుపుతున్న లిన్ గ్రోయిస్ బెక్ (25) అక్కడిక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న కూతురును సీట్ బెల్ట్ సాయంతో కదలకుండా చేయడంతో ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు.

శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నాం 12.30 గంటల ప్రాంతంలో ఓ జాలరి ఇచ్చిన సమాచారంలో నదిలో ఉన్న కారుని క్రేన్ సహాయంతో బయటకు తీయగా, ప్రాణాలతో ఉన్న చిన్నారి కనిపించింది.
చిన్నారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సుమారు 14 గంటల పాటు 0 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఆ చిన్నారి క్షేమంగా ఉండటం అధ్భుతమని సాల్ట్ లేక్ సిటీ పోలీసులు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications