బాగ్దాది వారసుడిని కూడా మట్టుబెట్టాం: డొనాల్డ్ ట్రంప్ ట్వీట్
సిరియాలో నక్కిన ఐఎస్ చీఫ్ బాగ్దాదిని అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధినేత ట్రంప్ కూడా మీడియాకు వివరించారు. అయితే బాగ్దాదితోపాటు ఆయన వారసుడిగా ప్రకటించే ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అయితే దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
అబుబకర్ ఆల్ బాగ్దాది చనిపోయిన తర్వాత ఐఎస్ చీఫ్ ఎవరు అవుతారనే అంచనాలు నెలకొన్నాయి. ఆ పోస్టు కోసం బాగ్దాది అధికార ప్రతినిధి, కుడిభుజం అబు హసన్ ఆల్ ముహజిర్ పేరు సహా మరికొందరి పేర్లు వినిపించాయి. ఆదివారం ఐన్-ఆల్-బేదలో అమెరికా సేనలు అతనిని కూడా మట్టుబెట్టారు. అయితే ట్రంప్ అతనిని ఉద్దేశించి ట్వీట్ చేశాడా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై వైట్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో స్పష్టత కొరవడింది.

ట్రంప్ ట్వీట్‌కు వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే కుర్దీస్ సేనలు మాత్రం నిజమేనని అంగీకరించాయి. కుర్దీష్‌కు సంబంధించి ఎస్డీఎఫ్ కమాండర్ మజ్‌లోమ్ అబ్దీ మాత్రం ముహజిర్ చనిపోయాడని తెలిపారు. అమెరికా సేనల సహయంతో ఎస్డీఎఫ్ ఆర్మీ మట్టుబెట్టిందని పేర్కొన్నారు. వాయవ్య సిరియాలో అమెరికా సేనలు దాడులు నిర్వహించి హతమార్చాయని పేర్కొన్నారు. దీంతో ట్రంప్ చెప్పిన బాగ్దాది వారసుడు ముహజిర్ అని అర్థమవుతుంది.
-
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనే..! ట్రంప్ కు షాక్..! -
వేసవిలోనూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగుతున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పర్షియన్ గల్ఫ్ దేశాన్ని తుడిచి పెడతాం- ఇంకో రెండు, మూడు వారాలే: తేల్చి చెప్పిన ట్రంప్ -
ఈ రోజు ఇరాన్ కు చుక్కలే.. చంపేస్తాం: ట్రంప్ సంచలనం -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..!












Click it and Unblock the Notifications