వారంలో ఉరి: జైల్లోనే ప్రియురాలితో పెళ్లి

కాన్‌బెర్రా: ఓ నేరం రుజువైన స్మగ్లర్ విషాద గాథ ఇది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నేరం కింద అరెస్టైన అతడు నేరం చేసినట్లుగా రుజువైంది. దీంతో అతనికి కోర్టు ఉరి శిక్ష విధించింది. కాగా, తనను ఎంతగానో ప్రేమించిన తన ప్రేయసి గుర్తుకు వచ్చిన ఆ నిందితుడు, తన చివరి కోరికగా ఆమెతో వివాహం చేయాలని కోరుకున్నాడు. అధికారులు ఇందుకు అంగీకరించడంతో జైలులోనే కుటుంబసభ్యుల మధ్య తన ప్రియురాలితో వివాహం ఘనంగా జరిగింది.

ఈ వివరాలన్నీ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దోషిగా తేలిన ఆండ్రూ చాన్ గురించి. ఆస్ట్రేలియాకు చెందిన ఇతడికి మరో వారం రోజుల్లో ఉరి శిక్ష అమలు కానుంది.ఆండ్రూ చాన్, మ్యూరన్ సుకుమారన్ సహా మరో ఏడుగురు 8.2 కేజీల హెరాయన్, 3.1 మిలియన్ల డాలర్ల నగదును ఇండోనేషియాకు అక్రమంగా రవాణా చేస్తూ 2005లో అరెస్టయ్యారు. నేరం రుజువు కావడంతో ఆండ్రూకు మరణ శిక్ష ఖరారయ్యింది.

Bali Nine: Andrew Chan marries fiancee ahead of expected execution this week

బాలి నైన్ డ్రగ్ కేసుగా పిలిచే కేసులో ఆండ్రూతో తొమ్మిదిమందికి ఉరిశిక్ష ఖరారయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రేమికులిద్దరూ.. ప్రస్తుతం ఆండ్రూ శిక్ష అనుభవిస్తున్న బేసి జైల్లో సోమవారం రాత్రి వివాహం చేసుకున్నారు. బంధువులు, ఇతర ఖైదీల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగిందని ఆండ్రూ సోదరుడు మిచెల్ తెలిపారు.

ఇండోనేషియన్ ప్రభుత్వం ఈ శిక్షలను ఖరారు చేస్తే ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు సమాచారం. వీరి ఉరి శిక్షలు ఈ వారంలో అమలు కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వీరి ఉరిశిక్షలను రద్దు చేయాలని కోరుతూ కుటుంబసభ్యులు, బంధువులు ఇటు ఆస్ట్రేలియా, అటు ఇండోనేషియా ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+