సినీ నటిపై రేప్: పోలీస్ కస్టడీకి బంగ్లా ప్రపంచ కప్ ఆటగాడు

ఢాకా: త్వరలో జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో ఆడేందుకు ఎంపిక చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో సభ్యుడైన ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్ ఓ సినీ నటిపై అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. అతడ్ని గురువారం కస్టడీకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని సినీ నటి అయిన 19ఏళ్ల యువతి డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసును విచారించిన ఢాకా కోర్టు నిందితుడు రుబెల్ హుస్సేన్‌కు రిమాండ్ విధించింది.

నిందితుడు రుబెల్ హుస్సేన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ అయ్యేంత వరకు జైలు ఉండాలని ఆదేశిచింది. దీంతో ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికైన రుబెల్ హుస్సేన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత వారమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతడ్ని ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేసింది.

Bangladesh's World Cup player jailed in actress rape case

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని కోర్టులో హాజరుపర్చామని ఢాకా డిసిపి అనిసూర్ రెహమాన్ తెలిపారు. బాధితురాలికి, నిందితుడికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. కాగా, తనను వివాహం చేసుకునేందుకు హుస్సేన్ అంగీకరించినట్లయితే తాను పెట్టిన కేసును ఉపసంహరించుకుంటానని బాధితురాలు పేర్కొంది.

2013 సెప్టెంబర్‌లో విడులైన ‘కిచు ఆశా భలోబాస' అనే చిత్రం ద్వారా బాధితురాలి వెండితెరకు పరిచయమైంది. ఒక వేళ తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించినట్లయితే అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

ఇది ఇలా ఉండగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడలేదని, ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా అనలేదని నిందితుడు రుబెల్ చెబుతున్నాడు. ఆ యువతి తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించాడు. కాగా, 22 టెస్టులాడిన రుబెల్ 32 వికెట్లు తీశాడు. 53 అంతర్జాతీయ వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచులో హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+