Sheikh Hasina: భారత్ కు బంగ్లా అనూహ్య షాక్ ? ఇంటర్ పోల్ ఎంట్రీ..!
బంగ్లాదేశ్ లో గతేడాది చోటు చేసుకున్న అల్లర్లు, విద్యార్ధుల మరణాలకు కారణమైన ఆరోపణలు ఎదుర్కొంటూ మరణశిక్ష పడిన మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్నారు. ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని భారత్ పరోక్షంగా తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ శాంతి కోసం తాము కట్టుబడి ఉన్నామని, అక్కడి కోర్టు షేక్ హసీనాపై ఇచ్చిన ఉత్తర్వుల్ని పరిశీలిస్తున్నట్లు చెప్పి తప్పించుకుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది.
గతేడాది నిరసనల్లో విద్యార్దులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన కేసులో ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం.. మాజీ ప్రధాని షేక్ హసీనా, హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌లను భారత్ నుంచి రప్పించేందుకు ఇంటర్‌పోల్ సాయం కోరాలని నిర్ణయించింది. ఈ మేరకు హసీనాను వెనక్కి రప్పించడానికి ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించబోతోంది.

భారత్ లో తలదాచుకుంటున్న షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ను తమకు అప్పగించాలని కోరుతూ త్వరలోనే మోడీ సర్కార్ కు లేఖ రాస్తామని అక్కడి ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. అయితే అంతలోనే ఐసీటీ ప్రాసిక్యూటర్ ఇంటర్‌పోల్ సహాయం కోరాలని నిర్ణయించారు. మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన వారెంట్ ఆధారంగా పారిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ కోరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రాసిక్యూటర్ గాజీ తమీమ్ వెల్లడించారు.

నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని, వారికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని కోరుతూ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్‌తో పాటు ఇంటర్‌పోల్‌కు ఇప్పటికే దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు. ఇప్పుడు అరెస్టు వారెంట్‌కు బదులుగా దోషిగా నిర్ధారించబడిన వారెంట్ ఆధారంగా కొత్త రెడ్ నోటీసు జారీ చేయాలని తాము విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఆ సంస్థను అడుగుతామని తెలిపారు. మరోవైపు భారత్ ను కూడా అధికారికంగా హసీనా, కమల్ ను అప్పగించాలని కోరేందుకు యూనిస్ సర్కార్ సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications