బాసన్ చార్‌కు రోహింగ్యాలు, శాటిలైట్ ఇమేజేస్ ఇవిగో.. లక్ష మంది వరకు, కానీ ఆందోళన..
రోహింగ్యాలను బంగాళాఖాతంలోని భాసన్ చార్‌కు బంగ్లాదేశ్ పంపిస్తోంది. భద్రతా కారణాల వల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం రోహింగ్యాలను కాక్స్ బజార్‌లో ఆశ్రయం కల్పించింది. బంగాళాఖాతంలో డెల్టా అవక్షేపాలతో ఏర్పడిన భాసన్ చార్ ప్రాంతంలో రోహింగ్యాల కోసం విడిదిని ప్రభుత్వం సిద్ధం చేసింది. కాక్స్ బజార్ నుంచి బంగ్లాదేశ్‌లోని నోఖాలి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాసన్ చార్‌కు లక్ష మంది రోహింగ్యా శరణార్థులను పంపిస్తోన్నామని అధికారులు తెలిపారు.
రోహింగ్యాలు స్వదేశం మయన్మార్‌కు వెళ్తే తప్ప వారిని భాసన్ చార్ విడిచిపెట్టేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు. భాసన్ చార్ ద్వీపాన్ని 14-15 సంవత్సరాల క్రితం గుర్తించారు. కాక్స్ బజార్‌లోని రోహింగ్యాల భారాన్ని తగ్గించాలని షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయించిన తరువాత.. బంగాళాఖాతంలోని భాసన్ చార్ ద్వీపంలో సౌకర్యాలను నిర్మించడం ప్రారంభించింది.

చైనాతో పాటు విదేశీ నిర్మాణ సంస్థలతో ఆశ్రయ గృహాలు, దవాఖానలు, పరిపాలనా భవనాలు, ప్రార్థనా మందిరాలను కూడా ప్రభుత్వం నిర్మించింది. రోహింగ్యాల మొదటి బ్యాచ్ గత వారం నౌకల్లో భాసన్ చార్ ద్వీపానికి చేరుకుంది. చిట్టగాంగ్ నౌకాశ్రయం బంగ్లాదేశ్ నుంచి మరిన్ని పడవలు రాబోయే కొద్ది రోజుల్లో వీరిని తరలించేందుకు సిద్దమవుతున్నాయి. అయితే కాక్స్ బజార్ శిబిరాల్లో ఎనిమిది లక్షలకు పైగా రోహింగ్యాలు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ సంఖ్యపై మాత్రం స్పష్టత లేదు
రోహింగ్యాల తరలింపునకు సంబంధించి ఉపగ్రహ చిత్రాలు కనిపించాయి. బాసన్ చార్ వద్దకు పంపించే ఫోటోలు ఆగుపించాయి. 2017 మే నుంచి శరణార్థుల తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. అయితే అదీ ఇప్పటికీ కొనసాగుతోంది. తాజా తరలింపునకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను ఇండియా టుడే వార్తా సంస్థ పోస్ట్ చేసింది.
ద్వీపంలో సరైన సౌకర్యాలు ఉన్నయా లేదా అనే అంశంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వ చర్యను మానవ హక్కుల సంఘాలు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ద్వీపంలో శరణార్థులకు ఆహారం, నీరు, వైద్యం, సంరక్షణ, విద్య సౌకర్యలు లభిస్తాయా అని అడుగుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications