తగులబడుతున్న బంగ్లాదేశ్..: రాత్రికి రాత్రి పాకిన అల్లర్లు
బంగ్లాదేశ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. అల్లర్లతో అట్టుడికిపోతోంది. రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు చెలరేగాయి. దాడులు- ప్రతిదాడులు సాగుతున్నాయి. భారత హైకమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా హౌస్ లను కూడా వదిలిపెట్టలేదు ఆందోళనకారులు. అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక 'ప్రథమ్ ఆలో', 'డైలీ స్టార్' కార్యాలయాలపై దాడులు సాగించారు. నిప్పు పెట్టారు. విధ్వంసాన్ని సృష్టించారు.
బంగ్లాదేశ్ అతివాద నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం 15న ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.

భారత్ తో పాటు ఉద్వాసనకు గురైన మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకి.. షరీఫ్ ఒస్మాన్ హాదీ. అతివాద ప్రసంగాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడిగా ఎదిగాడు. ఇంక్విలాబ్ మంచ్ తరఫున పలు ఆందోళనలకు నాయత్వం వహించాడు. అతని మారణవార్తను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఆ మరుక్షణం నుంచే అల్లర్లు మొదలయ్యాయి.
నిరసనకారులు 'ప్రథమ్ ఆలో', 'డైలీ స్టార్' కార్యాలయాలపై దాడి చేశారు. నిప్పంటించారు. రాజ్‌షాహి రోడ్ లోని అవామీ లీగ్ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వేలాది మంది షాబాద్ కూడలి వద్దకు చేరుకుని, రోడ్లను దిగ్బంధించారు. హాదీకి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. క్షణాల్లోనే ఆందోళన హింసాత్మకంగా మారింది. తొలుత కర్వాన్ బజార్‌లోని ప్రథమ్ ఆలో కార్యాలయంపై దాడి జరగ్గా, అనేక అంతస్తులను ధ్వంసం చేసి, ఫర్నిచర్‌ను బయటకు తీసి తగులబెట్టారు.
ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులు, సిబ్బంది భవనం లోపల చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. ఆ తర్వాత దుండగులు డైలీ స్టార్ కార్యాలయంపై దాడి చేసి, దాన్ని కూడా ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. గురువారం అర్ధరాత్రి నిరసనకారులు చిట్టగాంగ్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. భారత ఆక్రమణను అంతం చేయాలంటూ నినాదాలు చేశారు.
హదీ మరణం తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహమ్మద్ యూనుస్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శాంతియుతంగా ఉండాలని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా హాదీని నిర్భయ యోధుడిగా, అమరుడిగా అభివర్ణించారు. ఫాసిస్ట్ తీవ్రవాద శక్తులకు శత్రువు అని, అతని ప్రాణాలు తీయడం ద్వారా విప్లవకారులలో భయాన్ని నింపాలనుకున్న వారిని మళ్లీ ఓడిస్తామని యూనుస్ ప్రతిజ్ఞ చేశారు. హాదీ హంతకులను వదిలిపెట్టబోమని చెప్పారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications