మళ్లీ అగ్నిగుండంగా బంగ్లాదేశ్!.. యూనస్ ఇంటికి నిప్పు, 28 జిల్లాల్లో బాంబుల మోత!

పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర రాజకీయ హింస, అగ్నిప్రమాదాల గుప్పిట్లో చిక్కుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్‌లో తిరిగి దేశానికి వస్తానని ప్రకటించడం, ఆమె నేతృత్వంలోని నిషేధిత అవామీ లీగ్ పార్టీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. రాజధాని ఢాకా సహా దేశంలోని పలు జిల్లాల్లో నాటు బాంబుల పేలుళ్లు, దాడులు, అగ్నిప్రమాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

1945లో యాల్టా.. ఇప్పుడు షెన్‌జెన్! ప్రపంచ చరిత్ర మళ్లీ తిరగరాయబోతున్నారా?
1945లో యాల్టా.. ఇప్పుడు షెన్‌జెన్! ప్రపంచ చరిత్ర మళ్లీ తిరగరాయబోతున్నారా?

యూనస్ ఇంటికి నిప్పు
గత రెండ్రోజులు దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్నాయి. చట్టోగ్రామ్‌లోని పాంచ్‌లైస్ ప్రాంతంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం మాజీ సారథి మహమ్మద్ యూనస్ పూర్వీకుల నివాసానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. అలాగే సిల్హెట్, రాజ్‌షాహీ, బారిసాల్, ఫరీద్‌పూర్ ప్రాంతాల్లోని యూనస్‌కు చెందిన గ్రామీణ బ్యాంక్ శాఖలపై దాడులు చేసి తగలబెట్టారు. మరోవైపు ప్రధాని తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు ఢాకాలోని ఇద్దరు అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

Bangladesh Unrest Muhammad Yunus Ancestral Home Torched Bombs Explode Across 28 Districts Details

28 జిల్లాల్లో పేలుళ్లు.. నలుగురి మృతి
దేశంలోని మొత్తం 64 పరిపాలనా జిల్లాలకు గాను 28 జిల్లాల్లో డజన్ల కొద్దీ నాటుబాంబులు పేలాయి. పలు వాహనాలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఢాకాలో జరిగిన పేలుళ్లలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ నరైల్ జిల్లాలో బీఎన్‌పీ ర్యాలీపై అవామీ లీగ్ కార్యకర్తలు జరిపిన దాడిలో అధకార పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలు మరణించారు. ఫరీద్ పూర్, ఫిరోజ్ పూర్ జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో ఓ బీఎన్పీ నేత, ఓ రవాణా కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు.

షేక్ హసీనా ప్రకటనతో భగ్గుమన్న వివాదం
2024 ఆగస్టు 5న విద్యార్థి ఉద్యమంతో పదవి కోల్పోయిన షేక్ హసీన అప్పటి నుంచి భారత్ లో ఆశ్రయం పొందుతున్నరు. గతేడాది ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అవామీ లీగ్ ఈ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. మరణశిక్ష ఉన్నప్పటికీ డిసెంబర్‌లో ఏ ధర చెల్లించైనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ఈ నెల ప్రారంభంలో షేక్ హసీనా ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. మంగళవారం ఆమె స్వస్థలం తుంగిపారాలో 30 మంది మద్దతుదారులను అరెస్ట్ చేయడంతో వందలాది మంది పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. అవామీ లీగ్ ఓ 'ఉగ్రవాద సంస్థ', 'ఓడిపోయిన ఫాసిస్ట్ శక్తి' అని ప్రధాని తారిఖ్ రెహమాన్ మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంపైనే ఆధారపడకుండా ప్రజాస్వామ్య శక్తులన్నీ రోడ్లపైకి వచ్చి అడ్డుకోవాలని ఆయన ఎంపీలకు పిలుపునిచ్చారు.

భారీగా బలగాల మోహరింపు.. మాజీ మంత్రి అరెస్ట్
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు షేక్ హసీనా స్వస్థలం గోపాల్‌గంజ్ సహా సమస్యాత్మక జిల్లాల్లో వేలాది మంది 'బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్' బలగాలను మోహరించారు. గడిచిన 24 గంటల్లో ఒక్క ఢాకాలోనే పోలీసులు 565 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో షేక్ హసీనా కేబినెట్‌లో మాజీ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నూరుల్ ఇస్లాం నాహిద్ కూడా ఉన్నారు. ఆడియో, వీడియో ఆధారాలతో అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+