బ్యాంకులో స్పైడర్ మ్యాన్ ప్రత్యక్షం..ఫోటోలు వైరల్

సాధారణంగా కొన్నేళ్లపాటు ఓ ఉద్యోగం చేశాక ఎవరైనా సరే పదవీవిరమణ చేయక తప్పదు. అయితే రిటైర్‌మెంట్ అనేది అందరికీ ఓ మంచి జ్ఞాపకంలా మిగిలిపోవాలని ఉద్యోగులు భావిస్తారు. వారికే కాదు తమతో పాటు పనిచేసిన ఇతర ఉద్యోగులకు కూడా మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని పదవీవిరమణ చేసే ఉద్యోగి ఆలోచిస్తాడు. తాజాగా ఓ ఉద్యోగి తన చివరిరోజున వెరైటీగా ఆఫీసుకొచ్చాడు. ఇంతకీ ఎవరా ఉద్యోగి.. ఎలాంటి ఉద్యోగం చేశాడు... తన చివరిరోజును ఎలా గడిపాడు తెలుసుకోవాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరీ...

 స్పైడర్ మ్యాన్ గెటప్‌లో చివరిరోజు ఆఫీసుకు ఉద్యోగి

స్పైడర్ మ్యాన్ గెటప్‌లో చివరిరోజు ఆఫీసుకు ఉద్యోగి

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది స్పైడర్ మ్యాన్ అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆయన నిజంగా స్పైడర్ మ్యాన్ కాదు. ఓ బ్యాంకు ఉద్యోగి. తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహణలో చివరిరోజు కావడంతో అది ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోవాలని భావించాడు. అతనికే కాదు తన తోటి ఉద్యోగులకు కూడా తన రిటైర్‌మెంట్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేద్దామనుకుని ఇలా ప్లాన్ చేశాడు. ఈ ఫోటోలో స్పైడర్ మ్యాన్ గెటప్‌లో కనిపిస్తున్న ఉద్యోగి బ్రెజిల్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగి.

 షాక్‌కు గురైన సహోద్యోగులు

షాక్‌కు గురైన సహోద్యోగులు

బ్యాంకులో అందరూ కూర్చుని ఉండగా ఎర్రటి డ్రెస్‌లో ఎంటర్ అయిన ఈ వ్యక్తి నేరుగా తన కంప్యూటర్ సిస్టం దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. ఇక రోజూలానే తన పని తాను చేసుకోవడం మొదలు పెట్టడంతో సహోద్యోగులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆరా తీశారు. తర్వాత ఆ స్పైడరన్ మ్యాన్ తమ సహోద్యోగి అని తెలుసుకుని ఆనందపడ్డారు.

 మధుర జ్ఞాపకంగా మలుచుకున్న ఉద్యోగి

మధుర జ్ఞాపకంగా మలుచుకున్న ఉద్యోగి

కంప్యూటర్ ముందర కూర్చుని స్పైడర్ మ్యాన్ రోజూ వారీ విధులు నిర్వర్తిస్తుండటంతో కస్టమర్లు కూడా షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత నిజం తెలుసుకుని షాక్ నుంచి తేరుకున్నారు. ఇలా తన చివరి రోజు మొత్తం విధులను స్పైడర్ మ్యాన్ గెటప్‌లోనే నిర్వర్తించి తన చివరిరోజును ఆఫీసులో ఇలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వ్యక్తి ఇలా ఆఫీసులో కలియతిరుగుతున్నప్పుడు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు వీడియోను కూడా పోస్టు చేయడంతో తెగ వైరల్ అయిపోయింది. ఇప్పటికే ఆ వీడియోను 2.4 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజెన్లు చాలా ఫన్నీగా కామెంట్ చేశారు. వెబ్ డిజైనర్‌గా కొత్త ఉద్యోగంలోకి అడుగుపెట్టారంటూ ఛలోక్తులు విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+