భారత సంతతి డాక్టర్‌కి ఒబామా థ్యాంక్స్: మోడీ విషెస్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత సంతతికి చెందిన వైద్యురాలు డాక్టర్ సుమితా ఖత్రీకి ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి విశేషంగా కృషి చేసిన కొంతమంది వైద్యులను అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు.
వారిలో భారత సంతతికి చెందిన సుమితా ఖత్రి కూడా ఉన్నారు. క్లీవ్‌లాండ్ నగరానికి చెందిన సుమితా ఖత్రి తన కెరీర్‌లో ఎక్కువ భాగం పర్యావరణ కాలుష్యంపై పరిశోధనకు కేటాయించారని ఒబామా ప్రశంసించారు.

పర్యావరణ కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు, వాటిని తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేశారని అన్నారు. సుమితా అందిస్తున్న సేవలకు గాను ఒబామా ఆమెను ఉద్దేశిస్తూ 'డాక్టర్ థాంక్యూ...' అని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఒబామా 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.












Click it and Unblock the Notifications