అమెరికా సెనెట్: భారత సంతతి మహిళకు ఒబామా మద్దతు
లాస్‌ఏంజిలెస్: అమెరికా సెనెట్ ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేయాలనుకుంటున్న భారత సంతతి మహిళ కమలా హారిస్‌కు ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్‌లు మద్దతు పలికారు. దీంతో ఆమెకు అవకాశాలు మెరుగైనట్లేనని భావిస్తున్నారు.
51ఏళ్ల కమలా హారిస్.. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆమెను 'జీవితకాల కోర్టు గది ప్రాసిక్యూటర్'గా ఒబామా అభివర్ణించారు. అంతర్జాతీయ ముఠాలు, చమురు కంపెనీలు, తనఖా సంక్షోభానికి కారణమైన పెద్ద బ్యాంకులపై ఆమె పోరు సాగించారని కొనియాడారు.

'ఆమెను మీరు సెనెట్‌కు పంపితే.. కాలిఫోర్నియా ప్రజల తరఫున నిర్భయంగా పోరాడే యోధురాలవుతారు' అని ఒబామా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఎక్కడ్నుంచి వచ్చామనే విషయాన్ని మర్చిపోకుండా ప్రజల కోసం తన పోరాటం సాగించారని జో బిడెన్ ప్రశంసించారు.
కాగా, కమలా హారిస్.. వచ్చే నవంబర్‌లో జరిగే ఎన్నికల్లోపది సార్లు గెలిచిన డెమోక్రాట్ లొరెట్టా సంఛెజ్‌తో పోటీ పడనున్నారు. ఇది ఇలా ఉండగా, కమల.. ఆక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి 1960లో చెన్నై నుంచి వలస వెళ్లారు. కాగా, తండ్రి జెమైకన్ అమెరికన్.












Click it and Unblock the Notifications