ట్విస్ట్: మిషెల్లి కంటే ముందే షీలా తో ఒబామా ప్రేయాయణం

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ ప్రేమ కథ కూడ ఉంది. త్వరలో విడుదలయ్యే ఆయన జీవిత చరిత్రలో ఆయన ప్రేమ కథ గురించి ప్రస్తావన ఉండబోతోంది.

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ ప్రేమ కథ కూడ ఉంది. త్వరలో విడుదలయ్యే ఆయన జీవిత చరిత్రలో ఆయన ప్రేమ కథ గురించి ప్రస్తావన ఉండబోతోంది. మిషేల్లిని వివాహం చేసుకోకముందే ఆయన షీలా మియోషీ జాగర్ అనే యువతిని పెళ్ళి చేసుకోవాలని భావించాడు.

షీలా మియోషీ జాగర్ అనే మహిళ మిషెల్లీ రాకముందు ఒబామా ప్రేయసిగా ఉన్నారు.అయితే ఈ విషయమై త్వరలో రానున్న ఒబామా జీవిత చరిత్ర ద్వారా బయటిప్రపంచానికి తెలియనుంది.. రైజింగ్ స్టార్ :ది మేకింగ్ ఆఫ్ బరాక్ ఓబామా అనే పేరిట ఒబామా జీవిత చరిత్ర రాస్తున్న ప్రముఖ రచయిత డేవిడ్ జేగారో ఈ అంశాన్ని తన పుస్తకంలో రాశారు. అనేక రహాస్యాల్ని వివరించారు.

1986 శీతాకాల సమయంలో తాము తమ తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్ళినప్పుడు ఒబామా నాకు పెళ్ళి ప్రతిపాదన చేశాడు. ఆయనను పెళ్ళి చేసుకోవాలని కోరాడు. కానీ, మా కలయికను మా అమ్మానాన్నలు అంగీకరించలేదనా పుస్తక రచయితకు చెప్పారు.

Barack Obama proposed to another woman before meeting Michelle, book claims

ఆ సమయంలో ఒబామా కంటే ఆమె రెండేళ్లపాటు చిన్నది.దీంతో ఈ వివాహానికి ఆమె తల్లి అంగీకరించలేదని ఆమె చెప్పారు.పైగా ఒబామాకు రాజకీయాలపై ఆలోచన ఉండేది. అతడి రాజకీయ ఆలోచనలు గాడిలో పడడం మొదలైండి.ఆ క్రమంలో అతడు రాజకీయాల్లో బిజీగా మారాడు. జాతివివక్ష అంశం కూడ తమ సంబంధంపై పడి విడిపోయినట్టు చెప్పారామె.

1987ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అధ్యక్ష పదవి చేజిక్కించుకునే విషయంలో ఒబామాకు అప్పట్లోనే స్పష్టమైన ముందుచూపు, అంచనాలు ఉన్నాయి' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఒబామా హార్వార్డ్ లో విద్యను పూర్తి చేసిన తర్వాత చికాగో కు తిరిగొచ్చి స్థానిక న్యాయసంస్థలో ఉద్యోగంలో చేరడాని, అక్కడే ఆయనకు మిషెల్లి ఒబామా కలిసిందన్నారు. వారి సంబంధం అతి తక్కువ కాలంలో దృడపడి వివాహానికి దారితీసిందని కూడ వెల్లడించింది. అంతేకాదు, ఆమె హార్వార్డ్ లో ఫెలోషిఫ్ టీచింగ్ కు వచ్చిన సమయంలో కూడ ఒబామా తనను చూసేవాడని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+