ఒబామా:వేషధారణ మార్చి సముద్రతీరంలో ఉల్లాసంగా ఇలా..అదిరిందంటూ కామెంట్లు
అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసిన తర్వాత కుటుంబసభ్యులతో బరాక్ ఒబామా సెలవును ఎంజాయి చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన తన కుటుంబసభ్యులతో గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి
అమెరికా:8 ఏళ్ళపాటు అధ్యక్ష బాధ్యతల్లో బిజీ బిజీగా గడిపిన బరాక్ ఒబామా కుటుంబసభ్యులతో కలిసి సెలవులను ఎంజాయి చేస్తున్నారు. ఈ మేరకు తన కుటుంబసభ్యులతో కలిసి ఒబామా సెలవుల్లో సముద్రతీరంలో గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిషెల్ తో కలిసి సముద్ర తీరంలో సెలవుల్లో ఎంజాయి చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు మరికొందరితో కలిసి ఒబామా సముద్ర తీరంలో గడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

నలుపురంగు టీ షర్ట్, షార్ట్ ధరించి భార్యతో కలిసి ఒబామా తన భార్య మిషెల్లీతో కలిసి బీచ్ లో నడుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఒబామాను చూసి ఆశ్చర్యపోతున్నారు.అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఒబామా ఏ రకంగా ఉండేవారు , పదవికాలం ముగిసిన తర్వాత ఆయన వేషధారణలో వచ్చిన మార్పును గమనించారు.
సాధారణ దుస్తుల్లో ఒబామా చాల బాగున్నారని, ఆయన స్టైల్ అదిరందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఫిబ్రవరి 1వ, తేదిన ఈ వీడియోనుషేర్ చేశారు.అయితే ఈ వీడియోకు 1.5 లక్షల లైకులు వచ్చాయి. 78 వేల మందిపైగా ఈ వీడియో ను రీ ట్వీట్ చేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications