నేను బరిలో ఉంటే ట్రంప్ ఓడిపోయేవాడు, కానీ హిల్లరీ..: ఒబామా
తాను మళ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఉంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గెలిచి ఉండేవారు కాదని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా అన్నారు.
వాషింగ్టన్: తాను మళ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఉంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గెలిచి ఉండేవారు కాదని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా అన్నారు. సోమవారం తన చిరకాల మిత్రుడు, సీఎన్‌ఎన్ ఎనలిస్ట్ ఐన డేవిడ్ యాక్సలార్డోకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. హిల్లరీ క్లింటన్ ప్రచారంలో ఎటుంటి లోపం లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ చేసిన వాగ్ధానాల పైన హిల్లరీ భవిష్యత్తులో దృష్టి పెట్టవలసిన అవసరముందని చెప్పారు.

కొట్టిపారేసిన ట్రంప్
తాను బరిలో ఉంటే ట్రంప్‌ను ఓడిచేవాడినని ఒబామా చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు. ఉద్యోగాల సంక్షోభం, ఐసిస్, ఒబమా కేర్ వంటి అంశాలను పెట్టుకొని ఇంకా గెలుస్తాడని ఆయన భావిసున్నారా? నేనైతే ఆయన గెలుస్తాడని అనుకోవడం లేదన్నారు.
ఐక్య రాజ్య సమితి పైన ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
ఐక్య రాజ్య సమితి పైన ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్య రాజ్య సమితి సమర్థతను ఆయన దుయ్యబట్టారు. సరదాగా కాలక్షేపం చేయాలనుకునే వారికి అదొక క్లబ్ లాంటిది అన్నారు. ఇది చాలా విచారకరమన్నారు. ఐక్య రాజ్య సమితి విషయంలో జనవరి 20 తర్వాత పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications