భార్యకు భయపడి సిగరెట్ మానేశా: బరాక్ ఒబామ

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తన భార్య మిషెల్లీ అంటే భయమట. ఆ భయంతోనే తన సిగరేట్ అలవాటు మానుకున్నానని ఒబామ చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి వార్షిక సాధారణ సమావేశంలో పౌర సమాజం ప్రాముఖ్యత అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఒబామ మాట్లాడారు. ఈ సందర్భంగా ఒబాను మీడియా పలు ప్రశ్నలు అడిగింది.

తను సిగరేట్ వ్యసనం నుంచి ఎలా భయటపడ్డారని మీడియా అడిగిన ప్రశ్నకు ఒబామ బదులు ఇస్తూ..తన భార్య మిచెల్ అంటే భయం కారణంగానే తాను సిగరేట్ వ్యసనం నుంచి భయటపడ్డట్లు నవ్వుతూ చెప్పారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు చాలా కాలంపాటు సిగరేట్ వ్యసనానికి బానిసగా ఉన్నట్లు ఒబమా తెలిపారు. ఈ అలవాటు తన తండ్రి నుంచి వచ్చినట్లు ఒబమా చెప్పారు.

Barack Obama

2008 ఎన్నికల ప్రచారంలో ఒబమా సిగరేట్ వ్యసనం నుంచి ఎలా బయటపడ్డారనే విషయం మీడియాకు ప్రధాన అంశంగా మారింది. తన కార్యాలయంలో అడుగుపెట్టిన మొదటి ఏడాదిలో సిగరేట్ వ్యసనం నుంచి 95శాతం బయటపడేందుకు ప్రయత్నించానని ఒబమా తెలిపారు. ఒక్కోసారి తన ప్రయత్నంలో విఫలమైనట్లు కూడా ఆయన తెలిపారు.

కాగా ఒబమా 9నెలల నుంచి సిగరేట్ తాగడం లేదని 2010 డిసెంబర్‌లో వైట్ హౌజ్ అధికార ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ అధ్యక్షుడు ఒబమా సిగరేట్ వ్యసనానికి చేరువకాలేదని ఆయన చెప్పారు.

ప్రజారోగ్యంపై ప్రచారం నిర్వహించిన సందర్భంలో తన భర్త ఒబమా సిగరేట్ వ్యసనంపై మిచెల్ కొన్నిసార్లు ప్రస్తావించారు. తన కూతుర్ల ముందు ఒబమా ఎప్పుడూ సిగరేట్ సేవించేవారు కాదని మిచెల్ తెలిపారు. అయితే తన భర్త ఏడాది కాలం నుంచి సిగరేట్ తాగడం లేదని 2011 ఫిబ్రవరిలో మిచెల్ చెప్పారు. ఈ విషయంలో ఒబమాపై తన ఒత్తిడి ఏమి లేదని తెలిపారు. ఎవరైనా మంచి పని చేస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉందని మిచెల్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+