నా గర్ల్‌ఫ్రెండ్‌ను ముట్టొద్దు: ఒబామాతో వ్యక్తి, ముద్దు పెట్టి

 Barack Obama told by jealous boyfriend!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. చికాగోలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు అక్కడో వ్యక్తి ఒబామాతో.. మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోకు అన్నాడు. దాంతో ఒబామాతో పాటు సదరు ప్రేయసి కూడా షాక్‌కు గురయ్యారు.

చికాగోలో ఓటు వేయడానికి బరాక్ ఒబామా వెళ్లినప్పుడు ఆయన ఆయా కూపర్ అనే మహిళ తర్వాత నిలుచున్నారు. సరదాగా అధ్యక్షుడితో మాట్లాడాలని కూపర్ ప్రియుడు మైక్ జోన్స్‌కు అనిపించిందట. అందుకే ఆ మాట అన్నానని ఆ తర్వాత చెప్పాడు.

అసలు అధ్యక్షుడు తనతో పాటు ఓటు వేయడానికి వచ్చారనగానే తొలుత ఆమె కొంత ఉద్వేగానికి గురైంది. అంతలో ప్రియుడు ఈ మాట అనడంతో షాక్‌కు గురయింది. అయితే, సదరు యువకుడి మాటలకు ఒబామా కూడా సరదాగా స్పందించారు.

తనకు ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదని నవ్వుతూ చురక అంటించాడు. తనను అనవసరంగా ఇరిసిస్తున్నారన్నారు. అలాగే ఓటు వేసిన అనంతరం అతని ప్రియురాలిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టారు. అనంతరం ఆమెతో.. ఇప్పుడు నీ ప్రియుడు ఈర్షపడతాడని వ్యాఖ్యానించారు. అయితే, అతను అలా అన్నందుకు క్షమించాలని ఆమె ఒబామాను కోరారు.

ఇదిలా ఉండగా.. తనకు మిచెల్ ఒబామాను కలవాలని ఉందని ఆయా కూపర్ అధ్యక్షుడికి చెప్పింది. అలాగే, తనను అతను కేవలం బుగ్గమీదే ముద్దు పెట్టుకున్నారని, అందువల్ల మిచెల్ దీని గురించి ఏమీ అనుకోవద్దని ఆమె తెలిపింది. ఇప్పుడు ఇది ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. లక్షల మంది దీనిని చూస్తున్నారు. కాగా, బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోనికా లెవెన్‌స్కీతో సంబంధం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+