డొనాల్డ్ ట్రంప్ వల్ల నేను లావెక్కుతున్నా: ఆమె ఆరోపణ
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వల్లనే తాను లావుగా అవుతున్నానని చెప్పారు సింగర్ బార్బరా స్ట్రీసాండ్. ఉదయాన్నే వచ్చే ట్రంప్ వార్తల వల్ల తన దినచర్య దెబ్బతింటోందన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వల్లనే తాను లావుగా అవుతున్నానని చెప్పారు సింగర్ బార్బరా స్ట్రీసాండ్. ఉదయాన్నే వచ్చే ట్రంప్ వార్తల వల్ల తన దినచర్య దెబ్బతింటోందన్నారు.
ఇంతకుముందు రోజూ లేవగానే ద్రవపదార్థాలు తీసుకునే దానిని అని, ట్రంప్ వచ్చాక ప్యాన్‌కేకులు మేపుల్ సిరప్‌లో ముంచుకుని మరీ తింటున్నానని చెప్పారు.

కాగా, అధ్యక్ష ఎన్నికల సమయంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు తన టెలిఫోన్‌ని ట్యాప్ చేసినట్లు ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే.
దీనిపై బార్బరా స్పందించారు. ఒబామా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపిస్తున్నారని, అర్థంలేని మాటలు అని, మరిన్ని ప్యాన్‌కేకులు లాగించేయాల్సిన సమయం వచ్చేసిందన్నారు. తాను ట్రంప్‌కి మద్దతు తెలపడంలేదని బార్బరా గతంలోనే ప్రకటించారు. ట్రంప్ చెప్పిందేదీ నమ్మలేమన్నారు.












Click it and Unblock the Notifications