టీవీ షోలో వక్షోజాలు కనిపించేలా పాప్ సింగర్!: బీబీసీ క్షమాపణలు
న్యూఢిల్లీ: ప్రముఖ సింగర్ రివా ఓరా క్లీవరేజ్ పైన విమర్శలు రావడంతో ప్రముఖ చానల్ బీబీసీ క్షమాపణలు చెప్పింది. దాదాపు నాలుగు వందల మంది దీని పైన ఫిర్యాదు చేశారు. గత సోమవారం రాత్రి ఆమె పాపులర్ బ్రిటిష్ ఎర్లీ ఈవినింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
షో పేరు ది వన్ షో. దీనికి ఇతరులతో కలిపి ఆమె జడ్జిగా వ్యవహరించారు. దీనికి హోస్ట్‌లుగా మాట్ బేకర్, అలెక్స్ జాన్స్ వచ్చారు. అయితే, ఈ కార్యక్రమంలో రీటా ఓరా తన వక్షోజాలు కనిపించేలా కొంత అసభ్యంగా ఉన్నారు.

దీని పైన సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలోను విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఫేస్‌బుక్ పేజీలో క్షమాణలు చెప్పారు. నిన్నటి షోలో రిటా ఓరా క్లీవరేజ్ పట్ల మనస్తాపం కలిగిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆమె కూడా స్పందిస్తుందని చెప్పారు.
దీనిపై బీబీసీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. ది వన్ షోకు వచ్చే అతిథుల వేషధారణ వారి ఇష్ట ప్రకారమేనని, గ్రామర్ పాప్ స్టార్ రీటా ఓరాకు కూడా అదే వర్తిస్తుందన్నారు. అయితే, మరికొందరు ఫేస్‌బుక్ అభిమానులు మాత్రం ఆమె క్లీవరేజ్‌ను సమర్థించడం గమనార్హం. రిటా ఓరా వైట్ ట్రౌజర్ సూట్లో వచ్చారు.












Click it and Unblock the Notifications