నిజమండి! బీర్లు తాగి.. లక్షాధికారయ్యాడు!!
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం.. అవును ఇది ముమ్మాటికీ నిజం. మద్యం.. ప్రాణాలను హరించడంతోపాటు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తుంది. అయితే, ప్రాణం మాట పక్కన పెడితే, ఈ మద్యం తాగే అలవాటే ఓ వ్యక్తిని లక్షాధికారికిని చేసింది. ఎంతలా అంటే ఇంటర్నేషనల్ లెవెన్‌లో అతన్ని పాపులర్ చేసేంతలా! ఇప్పుడుతను ఒక్క తాగుబోతుమాత్రమే కాదు.. ధనవంతుడు కూడా!! మరెందుకు ఆలస్యం.. ఆ తాగుబోతు శ్రీమంతుని కథేంటో తెలుసుకుందా రండి!
నిక్ వెస్ట్ అనే బ్రిటన్‌కు చెందిన వ్యక్తి నాలుగు దశాబ్దాలకుపైగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. రోజూ బీర్లు తాగడం అలవాటుగా చేసుకున్నారు. అలా పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. అయితే, తాను ఇష్టంగా తాగే బీర్లను ఖాళీ చేసి.. ఆ బీర్ క్యాన్‌లను దాచుకోవడం హాబీగా పెట్టుకున్నాడు. అయితే, కొన్ని సంత్సరాలకు ఆ హాబీనే అతనికి ఇబ్బంది కలిగిచింది. నిక్ భద్రపరిచిన ఖాళీ బీర్ క్యాన్‌లతో అతని గది నిండిపోయింది. అయినప్పటికీ తన ఇష్టాన్ని వదులుకోలేక ఐదు బెడ్ రూమ్‌లు ఉన్న మరో అద్దె ఇంటికి మకాం మార్చాడు. కొన్నాళ్లకు అక్కడ కూడా అదే సమస్య ఎదురైంది. ఖాళీ బీర్ క్యాన్‌లు పెట్టేందుకు ఇంటి స్థలం సరిపోలేదు. అప్పటికే 65 సంవత్సరాల నిక్‌కు వయసు సహరించకపోవడంతో తనకు ఇష్టం లేకపోయినా ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయమే అతన్ని ఇప్పుడు లక్షాదికారిని చేసింది.

బ్రిటిష్ మ్యూజియంకు విరాళంగా..
తాను ఎంతో ఇష్టంగా దాచిపెట్టకున్న ఖాళీ బీర్ క్యాన్‌లలో కొన్నింటిని విక్రయించాలని ఫిక్స్ అయ్యాడు. అలా మొదటిసారిగా 6000 డబ్బాలను అమ్మగా $13500 వచ్చింది. అంటే మన కరెన్సీలో రూ. 14 లక్షలు. అందుకు కారణం.. ఈ బీర్ క్యాన్‌లు చాలా పాతకాలం నాటివి. ఆ డబ్బును చూసిన తర్వాత నిక్ ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత ఇటలీలోని బీర్ క్యాన్ డీలర్‌లకు 1,800 డబ్బాలను విక్రయించగా, వాటికి $12,500 అంటే మన దేశ కరన్సీలో రూ. 10,43,526కు అమ్ముడుపోవడంతో నిక్ ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోయాడు. నిక్ దగ్గర 1936వ సంవత్సరం నాటి పురాతన బీర్ క్యాన్ కూడా ఉంది. తన దగ్గర ఉన్న మూడు బీరు క్యాన్స్ చాలా అరుదైనవని, వాటి డిజైన్‌తోపాటు ఆకృతి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని నిక్ చెప్పుకొచ్చాడు. అలా ఆ బీర్ క్యాన్‌ల ప్రాముఖ్యతను గుర్తించిన నిక్ తాను దాచిన క్యాన్‌లలో అరుదైన వాటిని బ్రిటిష్ మ్యూజియంకు విరాళంగా కూడా అందజేశాడు.












Click it and Unblock the Notifications