వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అందమైన లేడీ టెర్రరిస్ట్' కోసం గాలింపు, స్తంభాలకి కట్టి పేల్చిన ఐసిస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిరియా/టర్కీ: 'అందమైన మహిళా టెర్రరిస్ట్' గురించి టర్కీ పోలీసులు వెతుకుతున్నారు. మోనాలిసాలా నవ్వే ఆ టెర్రరిస్ట్ పేరు వాలెంటీనా స్లోబోజనక్. ఆమె కోసం టర్కీ పోలీసులు దేశమంతా గాలిస్తున్నారు. ప్రతి వీధిలో ఆమె ఫోటోలను అతికించారు. ఆమె గురించి తెలిస్తే సమాచారం ఇవ్వమని చెబుతున్నారు.

టర్కీ భద్రతా దళాల ప్రకారం.. ఇరవై ఏళ్ల అందమైన టెర్రరిస్ట్.. వాలెంటీనా 1995లో కజకిస్తాన్‌లో జన్మించిందని భావిస్తున్నారు. ఆమె దొంగ పాస్ పోర్టు పైన సిరియా నుంచి టర్కీలో ప్రవేశించింది. ఆత్మాహుతి దాడికి వ్యూహం పన్నినట్లుగా అనుమానిస్తున్నారు.

‘Beautiful terrorist’ Walentina Slobodjanuk, 20, on run in Turkey

అంకారాలో ఇటీవల ఆత్మాహుతి దాడికి పాల్పడి వందమందికి పైగా ప్రాణాలు బలిగొన్న బృందంలో ఈమె కూడా ఉంది. ఆమెతో పాటు మరో ముగ్గురు సూసైడ్ బాంబర్లు దేశంలో తిరుగుతున్నారని, ఎప్పుడు, ఎక్కడ పేలిపోతారో, ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారోనని పోలీసులు, భద్రతా దళాలు ఆందోళన చెందుతున్నాయి. ఆమె నవ్వు అచ్చం మోనాలిసాను పోలి ఉంటుందని చెబుతున్నారు.

స్తంభాలకు కట్టేసి పేల్చారు

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా మరో ముగ్గురిని వారు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. సిరియాలోని పాల్మిరా నగరంలో ఒక ప్రాచీన కట్టడంలో స్తంభాలకు ముగ్గురు వ్యక్తులను కట్టేసి, ఆ స్తంభాలను పేల్చేశారు. దీంతో వారు ముక్కలు ముక్కలు అయ్యారు.

English summary
Turkish police are looking for an alleged Islamic State fighter named Walentina Slobodjanuk, who is on the run with a fake ID.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X