ప్రేమించిన వ్యక్తిని ఇష్టపడిందని కవల సోదరిని పొడిచిన మోడల్
క్రొయేషియా: క్రొయేషియాకు చెందిన ఓ మోడల్ తన సోదరిని (కవలలు) కత్తితో పొడిచింది. అందుకు ప్రేమనే కారణమని తెలుస్తోంది. తాను ప్రేమించిన వ్యక్తిని తన సోదరి ఇష్డపడటంతో ఆమె వారిపైన ఈ దారుణానికి పాల్పడింది.

ఓ యువకుడి విషయంలో ఆమె తన సోదరిని కత్తితో పొడిచింది. ఆమె పేరు సారా గ్రోవిక్ శ్(22). తాను ప్రేమించిన వ్యక్తిని ఆమె ఇష్టపడటం ఆ మోడల్ సహించలేకపోయిందని వార్తలు వచ్చాయి.

దీంతో ఆమె తన సోదరి దజనను వంటగదిలో వాడే కత్తితో పొడిచింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సోదరీమణులు తన తల్లితో కలిపి నార్తెర్న క్రొయేషియాలో ఉంటున్నారు. ఆ సోదరీమణుల గురించి పక్కింటి వారు మాట్లాడుతూ.. వారు ఎప్పుడు మర్యాదపూర్వకంగా ఉండేవారని, ఫ్రెండ్లీగా ఉంటారని చెబుతున్నారు.

కాగా, దనజకు ఛాతి పైన బాగా గాయాలయ్యాయి. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం బాధితురాలైన చెల్లెలి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. కాగా, మోడల్ సారా పైన అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications