వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షేప్ చేంజ్: 'కొంటె' చూపులకూ ఆ డ్రెస్ స్పందిస్తుంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: మహిళల పట్ల పురుషులు అదోరకంగా చూసినప్పుడు... షేప్ మార్చే 3డీ ప్రింటెడ్ దుస్తులు వచ్చాయి. తమను ఎవరు చూస్తున్నారు? ఆడవాళ్లా? మగవాళ్లా? ఎక్కడ చూస్తున్నారు? తదితర అంశాలను ఈ డ్రెస్ కనిపెట్టేస్తుంది.

చూపులకు అనుగుణంగా వెంటనే డ్రెస్ స్పందిస్తోంది. ఈ దుస్తుల్లో సంకోచ, వ్యాకోచ గుణాలు ఉన్నాయి. ఎదుటి వారి చూపు పడిన చోట వ్యాకోచిస్తుంది. ఈ దుస్తులను ప్రత్యేకమైన 3డి ప్రింటర్ ద్వారా అమెరికాకు చెందిన బెహనాజ్ ఫరాహీ అనే డిజైనర్ తయారు చేశారు.

Behnaz Farahi's 3D printed outfit changes shape when men stare at it

చర్మం కన్నా సున్నితమైన ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించి తయారు చేశారు. దీనికి కేరెస్ ఆఫ్ ది గేజ్ అని పేరు పెట్టారు. చూసేవారి చూపులను పసిగట్టేందుకు దుస్తుల్లో ఓ రహస్య కెమెరాను అమర్చారు. దానిని మైక్రో కంట్రోలర్‌తో అనుసంధానం చేశారు. ధరించిన వారి చర్మం ప్రవర్తనను బట్టి కూడా ఇది స్పందిస్తుంది. దాని ధర ఎంతుంటుందో ఇంకా వెల్లడించలేదు.

English summary
The anti-ogling shirt: 3D printed outfit changes shape when men stare at it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X