సమాధి నుంచి ఫోన్ చేసిన అన్న: ఎట్టకేలకు రక్షించగలిగిన తమ్ముడు..

వారి డిమాండ్ మేరకు 1.2మిలియన్ రూబుల్స్ తో పాటు తన బీఎండబ్ల్యూ 535కారును కూడా వారికి ఇచ్చేశాడు. అనంతరం సమాధి ఎక్కడుందో చెప్పడంతో.. హుటాహుటిన అక్కడికెళ్లి అన్న ఖిక్ మెట్‌ను రక్షించాడు ఇస్మాయిల్.

మాస్కో: వ్యాపార వ్యవహారాల్లో ఆర్థికంగా నెలకొన్న విభేదాలతో రష్యాలో ఓ వ్యక్తిని సజీవంగా పూడ్చిపెట్టారు. అయితే సమాధి నుంచే అతను తమ్ముడికి సమాచారం అందించడం.. సకాలంలో తమ్ముడు స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రష్యా రాజధాని మాస్కోలో ఉన్న ల్యూబర్టీ స్మశాన వాటికలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఖిక్ మెట్ సలేవ్(41) కొంత భాగస్వాములను కలుపుకుని వ్యాపారాలు చేస్తున్నాడు. ఇటీవల 30మిలియన్ రూబుల్స్ చెల్లించే విషయంలో ఖిక్ మెట్‌కు భాగస్వాములకు మధ్య విభేదాలు తలెత్తాయి.ఈ నేపథ్యంలోనే ఖిక్ మెట్ ను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు.

BEYOND THE GRAVE Businessman BURIED ALIVE by Moscow gangsters uses his mobile to call for help after being underground for four hours

మాస్కోలోని ల్యూబర్టీ స్మశాన వాటికకు తీసుకెళ్లి సజీవంగా పూడ్చిపెట్టారు. ఆ సమయంలో సెల్ ఫోన్ మాత్రం అతని వద్దే వదిలేశారు. దీంతో అతి కష్టం మీద సెల్ ఫోన్ ద్వారా తమ్ముడికి సమాచారం అందించాడు ఖిక్ మెట్. అయితే దాని చిరునామా మాత్రం చెప్పకపోవడంతో.. అతని తమ్ముడు ఇస్మాయిల్ ఖిక్ మెట్ వ్యాపార భాగస్వాములను సంప్రదించినట్లు చెబుతున్నారు.

వారి డిమాండ్ మేరకు 1.2మిలియన్ రూబుల్స్ తో పాటు తన బీఎండబ్ల్యూ 535కారును కూడా వారికి ఇచ్చేశాడు. అనంతరం సమాధి ఎక్కడుందో చెప్పడంతో.. హుటాహుటిన అక్కడికెళ్లి అన్న ఖిక్ మెట్‌ను రక్షించాడు ఇస్మాయిల్. అయితే అప్పటికే 4గం. పాటు సమాధిలో ఉన్న ఖిక్ మెట్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దానికి తోడు దండగుల దాడిలో పక్కటెముకలు కూడా విరిగిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+