దేశప్రధాని అయినా...అయిదు రోజుల పనిదినాలే... !

దేశ ప్రధాని అంటే మాములు విషయం కాదు, ఎప్పుడు దేశలంలో ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంటుంది. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉంటాయి. అవి లేవనెత్తిన అంశాలకు విమర్శలు చేయడానికి సరైన సమయం ఉండదు. అయినా దేశ ప్రధాని స్థాయిలో ఉండికూడ కూడ వారానికి అయిదు రోజుల మాత్రమే ప్రధానిగా బాధ్యతు నిర్వహించి మిగిలిన రెండు రోజుల్లో ఒక రోజు సమాజ సేవకు మరోక రోజు కుటుంభం కోసం కేటాయిస్తున్న ప్రధాని మంత్రి కూడ ప్రపచంలో ఉన్నారంటే ఆశ్చర్యం కల్గకమానదు. అయితే ఇది అక్షరాల నిజం..భారత్ కు పొరుగుదేశంలోనే ఇలాంటీ ప్రధాన మంత్రి ఒకరు ఉన్నారు.

ప్రపంచదేశాలకు భిన్నంగా భూటాన్ ప్రధాని

ప్రపంచదేశాలకు భిన్నంగా భూటాన్ ప్రధాని

మన పొరుగు దేశమైన భూటాన్ దేశం గురించి తెలిసిందే. చాల చిన్న దేశం దేశ మొత్త జనభా పట్టుమని పదిలక్షలు కూడ దాటదు. అయితే భూటాన్ రాజరిక వ్యవస్థనుండి బయటపడ్డ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోంది. ఈనేపథ్యంలోనే భూటన్ ప్రధానమంత్రిగా 2018 నవంబర్ లో లోటే షేరింగ్ ఎన్నికయ్యారు. కాగా ఆయనకంటే ముందు మరో ఇద్దరు ప్రధానమంత్రులు భూటాన్ పని చేశారు. గత భూటాన్ ప్రధానమంత్రులతో పాటు ప్రపంచంలోని ప్రధానమంత్రులకు భిన్నంగా భూటాన్ ప్రధాని అయిన లోటే షేరింగ్ తన విధులను నిర్వహిస్తున్నాడు.

ప్రధానిగా అయిదు రోజులే విధులు

ప్రధానిగా అయిదు రోజులే విధులు

ఈనేపథ్యంలోనే ప్రధాన మంత్రిగా ఎన్నికైన లోటే షేరింగ్ తన ప్రధానమంత్రి భాద్యతలను వారంలో అయిదు రోజులే మాత్రమే నిర్వహిస్తారు. మిగతా రెండు రోజులైన శనివారంలో ఆయన ఆసుపత్రిలో ఒక డాక్టర్ గా సేవలు అందిస్తారు.ఇక ఆదివారం ఆయన కుటుంభ సభ్యులతో గడుపుతారు. ఇలా అయన ప్రధానమంత్రి అయినప్పటి నుండి కొనసాగుతుందని చెప్పాడు.

భూటాన్ లో పేరు మోసిన సర్జన్ ఆయన...

భూటాన్ లో పేరు మోసిన సర్జన్ ఆయన...

కాగా లోటే షేరింగ్ ప్రధాని కాకముందు జపాన్ ,ఆస్ట్ర్రేలియా తోపాటు యూఎస్ లో డాక్టర్ గా శిక్షణ పొందారు. దీంతో భూటాన్ ఆయన ఒక బెస్ట్ సర్జన్ గా పేరపోందారు . షేరింగ్ డాక్టర్ వృత్తిలో ఉండగానే 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పుడే మొదటి సారి ప్రధాని పదవికి పోటి పడ్డారు. అయితే 2918లో ప్రధాని పదవి వరించింది.దీంతో అప్పటి నుండి కూడ డాక్టర్ వృత్తికి స్వస్థి చెప్పకుండా కొనసాగిస్తున్నారు..

ఆదివారం కుటుంభం కోసం

ఆదివారం కుటుంభం కోసం

ఇక సమాజ సేవ కాకుండా ప్రధాని లోటే షేరింగ్ కుటుంభ భాద్యతలను కూడ అదే స్థాయిలో తీసుకెళుతున్నాడు. తన కుటుంభం కోసం వారంలో ఒక్కరోజును కేటాయిస్తున్నాడు భూటాన్ ప్రధాని ఈనేపథ్యంలోనే శనివారం మొత్తం ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న ఆయన ఆదివారం మాత్రం కుటుంభసభ్యులతో గడుపుతారు.

ఆయనకు డాక్టర్ వృత్తి కొనసాగించడం ఇష్టం

ఆయనకు డాక్టర్ వృత్తి కొనసాగించడం ఇష్టం

అయితే వారంతం చివరలో ఎవరి ఇష్టాలకు అనుగుణంగా వారు ఉంటారని ఇందలో భాగంగానే కొంతమంది క్రీడలను ఇష్టపడితే తాను మాత్రం ఆసుపత్రికి వెళ్లి చేయడంలోనే సంతోషంగా ఉంటానని తెలిపారు. దీంతోపాటు ప్రజల ప్రాణలను కాపాడతానని చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల భవిష్యత్ తాను డాక్టర్ వృత్తిని మరచి పోకుండా ఉంటానని కూడ ఆయన స్పష్టం చేశారు. కాగా దేశాన్ని ఆరోగ్యపరంగా ఉంచడంలో తాను అత్యంత శ్రద్ద కనుబరుస్తానని వెల్లడించారు. సంతోషంగా ఉంటానని ఆయన చెబుతున్నారు.

ఆసియాలోనే సంతోషకరమైన దేశం భూటాన్..

ఆసియాలోనే సంతోషకరమైన దేశం భూటాన్..

అయితే ఆసీయాలోనే అంత్యంత సంతోషకరమైన దేశంగా భూటాన్ గుర్తింపు పోందిన దేశం.అయితే అయినా ఆదేశంలో 95 శాతం యువత ఉద్యోగాలు లేక క్రైం దిశగా అడుగులు వేస్తుండడంతోపాటు దేశంలోని డయాబెటీస్ తోపాటు ఒబేసిటీ సమస్యలు ఆదేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. మరోవైపు భూటాన్ ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తుంది.ఇందుకోసం జంతు నిషేధాన్ని విధించడంతోపాటు అక్కడి మౌంటెన్లను కాపాడేందుకు కర్భన రహిత ప్రాతంగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+