చరిత్ర సృష్టించబోతున్న బిడెన్, హ్యరిస్.. విజయానికి ఆరడుగుల దూరంలో.. ట్రంప్ కష్టం..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్ర ఆవిష్కృతం కాబోతుంది. ఈ సారి ప్రచార పర్వం కూడా ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఇక ఓట్ల లెక్కింపు అయితే నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తోంది. డెమోక్రటిక్ అభ్యర్థి బిడైన్ వైపు అమెరికా ప్రజలు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ట్రంప్ పరిస్థితి చావుతప్పి కన్నులొట్టబోయినా చందంలా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జో బిడెన్, కమలా హ్యరిస్ విజయం దిశగా అడుగులేస్తున్నారు. ట్రంప్ మాత్రం ఆశించిన స్థాయిలో ఓట్లు రావడం లేదు. ఇప్పటివరకు బిడైన్ 264 ఎలక్టొరల్ ఓట్లు గెలిచి.. విజయానికి 6 అడుగుల దూరంలో ఉన్నారు. అరిజోనాలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ 11 స్థానాలు ఉండగా.. బిడెన్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అయితే కౌంటింగ్ మరింత ఆలస్యమవనుంది. దీంతో అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన మరింత ఆలస్యమవనుంది.
ట్రంప్‌నకు 214 ఎలక్టొరల్ ఓట్లు వచ్చాయి. ఆయన అధ్యక్షడు కావాలంటే మరో 56 ఓట్లు కావాలి. కానీ అదీ అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెన్సిల్వేన్సియా, జార్జియా, నార్త్ కరోలినా, అరిజొనా, నెవాడలో కౌంటింగ్ జరుగుతోంది. పెన్సిల్వేన్సియాలో ట్రంప్ 1 లక్ష 35 వేల 671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications