వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వాడ్ మీటింగ్: మరింత శక్తిమంతంగా వ్యాక్సిన్, ప్రపోజ్ చేసిన అమెరికా అధ్యక్షుడు బిడైన్

|
Google Oneindia TeluguNews

ఇండో ఫసిఫిక్ రీజియన్ సమస్యలపై క్వాడ్ సమావేశం జరుగుతోంది. ప్రపంచం ఎదుర్కొంటోన్న సవాళ్లు, కరోనా వైరస్, చైనా దూకుడు గురించి చర్చిస్తున్నారు. 2019 నుంచి గతేడాది అక్టోబర్ వరకు నాలుగు వివిధ సందర్భాల్లో క్వాడ్ సమావేశం జరిగింది. విదేశాంగ మంత్రులు సమావేశమై.. సవాళ్ల గురించి డిస్కష్ చేశారు. ఇవాళ్టి సమావేశంలో ప్రధాని మోడీ, అమెరికా అధినేత బిడైన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తదితరులు పాల్గొన్నారు.

క్వాడ్ దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తుందని అధినేత బిడైన్ అన్నారు. అన్నీ దేశాలు కలిసి ఆర్థిక స్థిరత్వం సాధించాలని అభిప్రాయపడ్డారు. ఈ కూటమి సమస్యలపై చర్చించి.. పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పరిపుష్టం చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌ను కొత్త తరహాలో వృద్ధి చేస్తామని.. పేర్కొన్నారు. క్వాడ్ మరింత శక్తిమంతమై.. ప్రపంచ దేశాలకు ప్రయోజనం కలుగుతుందని అభిలషించారు.

Biden proposes joint partnership to boost vaccine manufacturing

వ్యాక్సిన్, వాతావరణ మార్పు, ఎమర్జింగ్ టెక్నాలజీ గురించి ప్రధానంగా చర్చిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కాపాడేందుకు క్వాడ్ పనిచేస్తుందని తెలిపారు. ప్రపంచంలో శాంతి సామరస్యం కాపాడేందుకు ప్రయత్నిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ అభిప్రాయపడ్డారు.

English summary
"This group is particularly important because it is dedicated to the practical solutions and concrete results," said US President Joe Biden.ఇండో ఫసిఫిక్ రీజియన్ సమస్యలపై క్వాడ్ సమావేశం జరుగుతోంది. ప్రపంచం ఎదుర్కొంటోన్న సవాళ్లు, కరోనా వైరస్, చైనా దూకుడు గురించి చర్చిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X