అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు బిగ్ షాక్..
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) కు భారీ షాక్ తగిలింది. 2017 నుంచి ప్రపంచ కుభేరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఆయన.. ఇప్పడు తన స్థానాన్ని కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోర్బ్స్ 2025 తాజా కుబేరుల జాబితా ప్రకారం.. రెండో స్థానం నుంచి ఆయన నాలుగో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం బెజోస్ ఆదాయం $227.8 బిలియన్లుగా తెలుస్తోంది.
ఒక్క రోజులో $26 బిలియన్ల లాభం..
ఈ జాబితాలో ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్ (Larry Ellison) ఆకస్మికంగా రెండో స్థానానికి ఎగబాకారు. ఒరాకిల్ కంపెనీ స్టాక్ ధర ఒక్కరోజులో 13% పైగా పెరగడం, కంపెనీ వృద్ధి రేటు గణనీయంగా మారడం ద్వారా ఆయన సంపద ఒక్కరోజులోనే $26 బిలియన్ల పెరుగుదల నమోదైంది. దాంతో ఎలిసన్ మొత్తం సంపద ఇప్పుడు $258 బిలియన్లకు చేరుకుంది.

ఒరాకిల్ క్లౌడ్ సేవల ఆదాయం 21% వృద్ధి చెంది $6.7 బిలియన్లకు చేరుకోవడం.. క్లౌడ్ మౌలిక సదుపాయాల అమ్మకాలు 53% పెరగడం వంటి అంశాలు ఈ మార్పునకు కారణాలుగా తెలుస్తున్నాయి. ల్యారీ ఎలిసన్‌కు ఒరాకిల్‌లో దాదాపు 40% వాటా ఉండడం వల్ల.. ఒక్కసారిగా ఆదాయం విషయంలో పై స్థానానికి ఎగబాకారు. మరోవైపు ఎలాన్ మస్క్ అగ్రస్థానం లోనే కొనసాగుతున్నారు.
ఫోర్బ్స్ తాజా జాబితా (2025) ప్రకారం టాప్ 5 ప్రపంచ ధనవంతులు వీరే..
ఎలాన్ మస్క్ (Elon Musk) - $408.2 బిలియన్లు
ల్యారీ ఎలిసన్ (Larry Ellison) - $258 బిలియన్లు
మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) - $239.3 బిలియన్లు
జెఫ్ బెజోస్ (Jeff Bezos) - $227.8 బిలియన్లు
బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) - దాదాపు $200 బిలియన్లు












Click it and Unblock the Notifications