బైకర్ గ్యాంగ్ కాల్పులు, తొమ్మిది మంది దుర్మరణం
టెక్సాస్: పార్కింగ్ విషయంలో గొడవ జరిగి సహనం కోల్పోయి కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్దరాత్రి కాల్పులు జరిపిన నిందితులు అక్కడి నుండి పరారైనారు.
ఆదివారం అర్దరాత్రి టెక్సాస్ లోని వాకా వద్ద పీక్స్ రెస్టారెంట్ వద్దకు కొందరు వెళ్లారు. రెస్టారెంట్ సమీపంలో వాహనాల పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. సహనం కోల్పోయిన కొందరు తుపాకులతో ఇష్టారీతిగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పులలో 8 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఒకరు మరణించారు. ఈ కాల్పులలో 18 మందికి తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రైవల్ బైకర్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడిందని పోలీసులు ఆధారాలు సేకరించారు. రెస్టారెంట్ సమీపంలో, పార్కింగ్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామని, దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications