కాఫీ షాపులోనే మహిళపై అత్యాచారయత్నం, బాధితురాలు ఏం చేసిందంటే?
వాషింగ్టన్:అమెరికాలోని వాషింగ్టన్‌లో గల కెంట్ నగరంలో ఓ కాఫీ షాపులో పనిచేసే మహిళను షాపు నుండి కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు ఓ నిందితుడు. అయితే నిందితుడి నుండి తప్పించుకొన్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీకెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో నిందితుడు పలు కేసుల్లో శిక్షను అనుభవించాడని పోలీసులు ప్రకటించారు.
వాషింగ్టన్‌లోని కెంట్ నగరంలో 'హాటీ షాట్స్ ఎస్‌ప్రెస్సో' అనే ఓ కాఫీ షాపు ఉంది. కస్టమర్లకు బికినీ వేసుకుని 30 ఏళ్ల మేడ్‌లైన్ గుయింటో అనే మహిళ కాఫీ సర్వ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె తన పని చేసుకుంటుండగా కిటికీ గుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఆమెపై పడి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఎవరైనా వస్తారేమోనన్న భయంతో ఆమెను కత్తితో బెదిరించి కిటీకి గుండానే బయటకు ఎత్తుకెళ్లాడు.

చీకట్లో అతని నుంచి తప్పించుకునేందుకు శాయశక్తుల కృషి చేశా.. కానీ, లాభం లేకపోయింది. బయటకు తీసుకెళ్లాక అతను నన్ను గాయపరిచాడు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అరిచినట్టు బాధితురాలు చెప్పారు.తాను ప్రతిఘటించేసరికి నిందితుడు పారిపోయాడని బాధితురాలు చెప్పారు.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు మైకేల్ రేనాల్డ్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి నేర చరిత్ర ఉందని.. ఓ దోపిడీ కేసులో పదేళ్ల శిక్ష అనుభవించిన రేనాల్డ్స్ గత సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు ప్రకటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications