హెచ్-1బీ వీసాలపై మళ్లీ టెన్షన్.. ప్రతినిధుల సభ ముందుకు మళ్లీ బిల్లు
అవుట్ సోర్సింగ్ అమెరికన్ ఉద్యోగాలను నిర్మూలించేలా ఓ బిల్లును మళ్లీ అమెరికన్ చట్టసభ సభ్యులు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.
వాషింగ్టన్: హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసేంత వరకు అమెరికన్ చట్టసభ సభ్యులు విశ్రమించేటట్టు కనిపించడం లేదు. అవుట్ సోర్సింగ్ అమెరికన్ ఉద్యోగాలను నిర్మూలించేలా ఓ బిల్లును అమెరికన్ చట్టసభ సభ్యులు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.
హెచ్-1బీ వీసా ప్రోగ్రాంను దుర్వినియోగ పరుస్తూ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించే అమెరికన్ కంపెనీలకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు వచ్చింది. డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ కిల్మర్, తన రిపబ్లికన్ కొలీగ్ డౌ కాలిన్స్ గురువారం ఈ బిల్లును 'ది కీపింగ్ అమెరికన్ జాబ్స్ యాక్ట్' పేరుతో ప్రవేశపెట్టారు.

మొదటినుంచి హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై పోరాడుతూ వస్తు్న వీరు.. తొలిసారి 2016లో ఫిబ్రవరి 24న గత కాంగ్రెస్ లో ఈ బిల్లను ప్రవేశపెట్టారు. హెచ్-1బీ ప్రోగ్రాం ద్వరా తాత్కాలిక వీసాలు పొందుతూ అమెరికాకు వచ్చే వారిని నిరోధించడమే లక్ష్యంగా.. అమెరికన్ ఉద్యోగాలు ఇతర దేశాలకు తరలిపోకుండా ఉండేలా ఈ బిల్లను మళ్లీ ప్రవేశపెట్టామని చట్టసభ్యులు తెలిపారు.
అమెరికన్ ఉద్యోగులకు గండికొట్టే ఏ చట్టాలను తాము అనుమతించమని, హెచ్-1బీ వీసా ప్రక్రియను దుర్వినియోగ పరిచే కంపెనీల నుంచి అమెరికన్ ఉద్యోగాలను రక్షించడమే కీపింగ్ అమెరికన్ జాబ్స్ యాక్ట్ లక్ష్యమని వీరు పునరుద్ఘాటించారు.
తమ ఆర్థిక వృద్ధిని పెంచుకుంటూ ఉద్యోగాలు కాపాడటం ఎంతో కీలకమైన అంశమని కాలిన్స్ పేర్కొన్నారు. క్వాలిఫైడ్ అమెరికన్లు అందుబాటులో లేరనే నెపంతో హెచ్-1బీ వీసాలతో కంపెనీలు ఇతర దేశాల ఉద్యోగులను ఇక్కడికి తెచ్చుకుంటున్నాయని, ఇకపై దీనికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాలో ఉద్యోగాలు ప్రమోట్ చేసేలా తమ విధానాలు ఉంటాయని కిల్మర్ పేర్కొన్నారు. అయితే అమెరికాలో హై-టెక్ ఉద్యోగాలకు భారత్ లాంటి దేశాల నుంచి స్కిల్డ్ వర్కర్లను హెచ్-1బీ వీసా ప్రోగ్రాం ద్వారా అనుమతిస్తామని చెబుతూ పీబీసీలో 60 నిమిషాల డాక్యుమెంటరీ వచ్చిన అనంతరం ఒక్క రోజులోనే మళ్లీ హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసేంత వరకు తగ్గేది లేదంటూ చట్టసభ సభ్యులు ఈ బిల్లను ప్రవేశపెట్టడం గమనార్హం.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications