వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లింటన్ శృంగార బాగోతం: మాజీ అధ్యక్షుడి భార్యపై బలవంతం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వయసులో తనకన్నా 17 ఏళ్లు పెద్దది, మాజీ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ సతీమణి జాక్వలిన్ కెన్నడీని మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మోహింపజేయాలని చూశాడంట. ఆమె నిరాకరిస్తున్నా, బలవంతంగా ఆమెతో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించాడట.

ఈ విషయాన్ని జాన్‌ ఎఫ్ కెన్నడీ భార్య అయిన జాక్వలిన్‌ తాజా పుస్తకంలో వివరించారు. అప్పుడు జాక్వలిన్ కెన్నడీ వయసు 60 ఏళ్లు. న్యూయార్క్‌లో మాన్‌హాట్టన్‌లోని ఫిప్త్ అవెన్యూలోని తన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన బిల్ క్లింటన్ తనను మోహింపజేయాలని చూశాడని తెలిపారు.

ఈ సమయంలో వాళ్లిద్దరి మధ్య 'కుస్తీ పోటీ'లాంటి పెనుగులాట జరిగిందని, అతి కష్టం మీద అతన్ని దూరం తోసేసి, ఈ ఘోరం నుంచి జాక్వలిన్ బయటిపడినట్టు ఈ పుస్తకం తెలిపింది. 'బిల్‌ అండ్ హ్యారీ: సో దిస్ ఈజ్‌ దట్ థింగ్ కాల్డ్ లవ్' అనే పుస్తకంలో రచయితలు డార్విన్ పార్టర్, డాన్‌ఫోర్త్ ప్రిన్స్ ఈ విషయాలను వెల్లడించారు.

Bill Clinton 'tried to seduce' Jacqueline Kennedy

బిల్ క్లింటన్ కూడా తన భర్త జాన్‌ ఎఫ్‌ కెన్నడీ లాంటివాడేనని, అందమైన యువతులతో లైంగిక సంబంధాలు నెరపడంలో పేరుమోసిన వీరిద్దరూ శృంగారంలో 'నో' అనే సమాధానం వస్తే సహించేవారు కాదని జాక్వలిన్ ఓ సందర్భంలో తన స్నేహితురాలితో చెప్పిందని పుస్తకంలో పేర్కొన్నారు.

కాగా బిల్ క్లింటన్ తన చిన్నతనం నుంచే జాన్ ఎఫ్ కెన్నడీని అమితంగా అభిమానించేవాడు. 1963లో వైట్‌హౌస్‌కు వచ్చిన క్లింటన్ అప్పటి అధ్యక్షుడైన కెన్నడీని రోజ్ గార్డెన్‌లో కలిశాడు. ఆ తర్వాత 1992లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు జాన్ ఎఫ్ కెన్నడీ ఆశీస్సులను కూడా తీసుకున్నారు.

1963లో జాన్ ఎఫ్ కెన్నడీ హత్య అనంతరం బిల్ క్లింటన్ జాక్వలిన్ కెన్నడీకి బాగా సహాయం చేశారు. అయితే, ఆ తర్వాత వీరిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కాగా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ, బాలీవుడ్ నటి మార్లిన్ మన్రో మధ్య సంబంధాలు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి.

English summary
Bill Clinton once tried to seduce Jacqueline Kennedy at her New York apartment despite the 17-year age gap. The former President ‘almost forcibly’ tried to have sex with the former First Lady even though she protested, a new book claims in an outlandish account of the encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X