Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా సృష్టికర్త.. బిల్ గేట్స్: వైరస్ పుట్టుక వెనక ఆయన హస్తం: ట్రంప్ రాజకీయ సలహాదారుడు

న్యూయార్క్: భయానక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చుట్టుబెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ సలహాదారుడొకరు దాని పుట్టుక గురించి సరికొత్త అనుమానాలను లేవనెత్తారు. వైరస్ పుట్టుక వెనుక కుట్ర కోణం దాగి ఉందని అన్నారు. కరోనా వైరస్ పుట్టుకుని రావడానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాన కారణమనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయన పేరు-రోజర్ స్టోన్.

డొనాల్డ్ ట్రంప్ రాజకీయ సలహదారుడిగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ప్రచార కార్యక్రమాల పర్యవేక్షకుడిగా వ్యవహరించారు రోజర్ స్టోన్. తాజాగా ఆయన 970 ఎఎం రేడియో ది ఆన్సర్ పేరుతో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ పుట్టుకుని రావడంలో బిల్ గేట్స్ పాత్ర కొద్దో, గొప్పో ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ సాగుతోందని అన్నారు.

Bill Gates may have created coronavirus to microchip people, says Roger Stone

కరోనా వైరస్ వ్యాప్తి చెందడంలో బిల్‌గేట్స్ సహా ప్రపంచవ్యాప్తంగా కొందరు మేధావుల హస్తం ఉందని తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు. తాము తయారు చేసిన వ్యాక్సిన్లు, తాము రూపొందించిన మైక్రో చిప్‌లను వినియోగించేలా ప్రపంచ దేశాల ప్రజలు వినియోగించేలా ఓ అసహాయ పరిస్థితిని తీసుకుని రావడమే దీనికి ప్రధాన కారణమై ఉండొచ్చని రోజర్ స్టోన్ అన్నారు. వారి ప్రయత్నం బెడిసి కొట్టినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మృతదేహాలకు వ్యాక్సిన్లు అవసరమా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

తనకు కొంతమంది కన్జర్వేటివ్‌కు చెందిన స్నేహితులు ఉన్నారని, వారితో ఈ విషయాన్ని చర్చించినట్లు రోజన్ పేర్కొన్నారు. దీన్ని కొందరు తోసిపుచ్చారని, మరి కొందరు తనతో ఏకీభవించినట్లు చెప్పారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రోజర్ స్టోన్.. డొనాల్డ్ ట్రంప్ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొన్ని వివాదాలను ఆయనను చుట్టుముట్టాయి. ఫలితంగా 40 నెలల పాటు ఆయన జైలులో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+