కోవిడ్-19ను ఎప్పుడో ఊహించా... తేరుకోవాలంటే 10వారాలు లాక్‌డౌన్ తప్పనిసరి: బిల్ గేట్స్

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఎటు చూసినా కరోనావైరస్ మాటే తప్ప మరొకటి కనిపించడం లేదు.. వినిపించడం లేదు. ప్రపంచదేశాలన్నీ దాదాపుగా లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే కరోనావైరస్‌ నివారణకు ఎలాంటి టిప్స్ పాటించాలో ఎవరికి తెలిసినది వారు చెబుతున్నారు. అదే సమయంలో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ కోవిడ్-19పై ఎలా పోరాటం చేయాలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 గురించి కొన్నేళ్ల క్రితమే తాను ఊహించినట్లు ఇంటర్వ్యూలో చెప్పారు బిల్ గేట్స్. ప్రపంచాన్ని ఒక మహమ్మారి కబళిస్తుందని అది ఎందుకు కబళిస్తుందో కూడా కొన్నేళ్ల క్రితమే చెప్పినట్లు బిల్ గేట్స్ వెల్లడించారు. కరోనావైరస్ లక్షణాలు బయటపడకముందే ఇది ఒక ఇన్‌ఫెక్షన్ అనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఇలాంటి వైరస్‌లు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. ఉదాహరణకు ఎబోలా లాంటి వైరస్ వస్తే దాని లక్షణాలు ముందుగానే బయటపడుతాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే సమయంలో కొన్ని సాధారణ వైరస్‌లు అయిన జలుబు, జ్వరంలాంటివి ఉన్నప్పటికీ రోజువారీ కార్యక్రమాలను చేసుకోగలుగుతామని చెప్పారు. కానీ కరోనావైరస్ మాత్రం అలా కాదని లక్షణాలు బయటపడకముందే ఊపిరితిత్తులకు చేరుకుంటుందని చెప్పారు.

Bill Gates shares his views on Covid-19 pandemic and how one must respond to the virus

ఇక ప్రజలు ఉన్న చోట ఉండకుండా ప్రపంచమంతా తిరుగేస్తున్నారని దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాకిపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు బిల్ గేట్స్. మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకుతుందని విన్పప్పుడు ఇలాంటి వైరస్‌ను నియంత్రించడం అసాధ్యమని జనవరిలోనే తాను ఊహించినట్లు చెప్పాడు. అంతేకాదు కరోనావైరస్ సోకి బయటపడేందుకు తీసుకునే సమయంలో మధ్యలో చాలా జరుగుతాయని బిల్ గేట్స్ చెప్పారు. ఇక బిల్ గేట్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా సంగతులు పంచుకున్నారు. ఈ వీడియోను ఒక్క బిల్‌గేట్స్‌ను అభిమానించేవారికి మాత్రమే కాదు.. కోవిడ్‌-19 గురించి తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూను వీక్షించాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+