బిల్ గేట్స్ తొలి ట్రిలియనీర్ కాబోతున్నారు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ట్రిలియనీర్ కాబోతున్నారు. వచ్చే ఇరవై అయిదేళ్లలో ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ కానున్నారు.
హూస్టన్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ట్రిలియనీర్ కాబోతున్నారు. వచ్చే ఇరవై అయిదేళ్లలో ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ కానున్నారు. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ సంస్థ తన పరిశోధనా నివేదికలో దీనిని వెల్లడించింది.
పన్నులు వేయను కానీ, షరతు: సీఈవోలకు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చి, ట్రంప్ వార్నింగ్
బిల్ గేట్స్ ట్రిలియనీర్‌గా అయ్యే సమయానికి ఆయన వయస్సు 86 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. ఆయన ఆస్తులు 2009 నుంచి ప్రతి ఏటా సుమారు పదకొండు శాతంతో వృద్ధి చెందుతున్నాయి.
కనీసం వంద కోట్ల డాలర్లు ఉంటే బిలియనీర్. ట్రిలియనీర్ అంటే లక్ష కోట్ల డాలర్ల కంటే ఎక్కువే ఉన్నట్టు. ఇది భారతీయ కరెన్సీలో చెప్పాలంటే.. రూ.68 లక్షల కోట్లుగా అంచనా వేయవచ్చు.

ఆయన వద్ద ప్రస్తుతం 84.6 బిలియన్ డాలర్ల సంపద ఉంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 5 లక్షల 76 వేల కోట్లు. ఇది 25 ఏళ్లల్లో 68 లక్షల కోట్లు అయితే అప్పుడు అతను ట్రలియనీర్‌గా మారుతారు.
2006లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్‌ను వదిలినప్పుడు ఆయన ఆస్తులు 50 బిలియన్ల (5 వేల కోట్ల) డాలర్లు. 2016లో ఆయన సంపద 75 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఛారిటీ సంస్థ ద్వారా విరాళాలు ఇస్తున్నా, బిల్ గేట్స్ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి.
ఫోర్బ్స్ వెల్లడించిన జాబితాలో వారెన్ బఫెట్, బిల్ గేట్స్, ఇండిటెక్స్ ఫౌండర్ అమాన్సియో ఒర్టెగా, కార్లోస్ స్లిమ్, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్, 'ఫేస్ బుక్ ' మార్క్ జుకర్ బర్గ్, న్యూయార్క్ మాజీ మేయర్ మైకేల్ బ్లూమ్‌బర్గ్, 'ఒరాకిల్' లారీ ఎలిసన్‌లు ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications