కుక్క కాళ్లకు రూ.25 లక్షల బంగారు యాపిల్ వాచ్‌లు (వీడియో)

బీజింగ్: శ్రీమంతుల ఇంటిలో ఉన్న కుక్కకు ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. విశ్వాసంగా పెంచుకుంటున్న కుక్కలకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వెయ్యరని ఒక యువకుడు నిరూపించాడు. తన ఆర్థిక స్థోమతను ఇతరులకు చూపించడానికి చాలామంది అనేక విధాలుగా ప్రయత్నిస్తారు.

ఖరీదైన ఆభరణాలు, వస్తువులు, దుస్తులు వేసుకుని బయటవారిని ఆకర్షిస్తుంటారు. అయితే చైనాలోని ఒక యువకుడు తన పెంపుడు కుక్కకు ఖరీదైన వాచ్‌లు రెండు కాళ్లకు కట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతను కుక్కకు కట్టిన వాచ్ విలువ అక్షరాల రూ.25 లక్షలు.

Billionaire buys his dog two Apple Watches in China

చైనాలో సంపన్న వ్యాపారవేత్త వాంగ్ జియన్ లిన్ నివాసం ఉంటున్నారు. ఈయన పలు దేశాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చైనాలో ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈయన కుమారుడు వాంగ్ సికాంగ్ (26). ఇతనికి పెంపుడు కుక్క ఉంది. ఇటివల ఇతను రూ. 25 లక్షలు ఖర్చు పెట్టి బంగారపు యాపిల్ వాచ్‌లు కొన్నాడు.

ఆ వాచ్‌లు ఆయనగారు వేసుకోవడానికి కాదు. తన పెంపుడు కుక్క కోసం. రెండు వాచ్‌లను కుక్క ముందరి రెండు కాళ్లకు కట్టాడు. కుక్క ఫోటోను సోషల్ మీడియాలో పెట్టాడు. కుక్క పేరుతో ట్విట్టర్ లో రెండు డైలాగ్‌లు వ్రాసి పెట్టాడు.

నాకు నాలుగు కాళ్లు ఉన్నాయి, అందులో రెండు కాళ్లకు రెండు బంగారు వాచ్‌లు ఉన్నాయి. త్వరలో మిగిలిన రెండు కాళ్లకు వాచ్ లు వస్తాయని ఎదురు చూస్తున్నాను అని చైనా ట్విట్టర్ వీబొలో కామెంట్స్ చేశాడు. వాంగ్ సికాంగ్ ఘనకార్యం చూసి ట్విట్టర్ లో చాలామంది పలు విధాలుగా స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+