ఆగని బిట్ కాయిన్ పతనం... 6,000 డాలర్ల లోపునకు పడిపోయిన క్రిప్టోకరెన్సీ
వాషింగ్టన్: ఏడాది వ్యవధిలోనే 900 డాలర్ల నుంచి 20,000 డాలర్లకు పెరిగి మదుపరులను ఊహల పల్లకీలో ఊరేగించిన బిట్ కాయిన్... పతనం ఆగడం లేదు. మంగళవారం లగ్జెంబర్గ్ బిట్ స్టాంప్ ఎక్సేంజ లో ఒక బిట్ కాయిన్ ధర 5,995.58 డాలర్లకు (సుమారు రూ.3.85లక్షలు) పడిపోయింది.
క్రిప్టో కరెన్సీగా పిలిచే బిట్ కాయిన్ గరిష్ట ధర గత డిసెంబర్‌లో 20,000 డాలర్లు (రూ.12.86 లక్షలు)తో పోల్చి చూస్తే.. మూడింట రెండొంతుల బిట్‌కాయిన్ విలువ ఆవిరైపోయిందనే చెప్పొచ్చు. ఈ బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ పరుగులకు ఆకర్షితులై మన దేశంలోనూ దీనిపై మదుపు చేసే వారి సంఖ్య గడిచిన ఏడాదిలో గణనీయంగానే పెరిగింది.

ప్రపంచ ఆర్థిక రంగానికి, దేశాల అధికారిక కరెన్సీలకు హానికరంగా మారిన బిట్ కాయిన్‌పై పలు దేశాలు కఠిన చర్యలకు ప్రయత్నిస్తుండడం దీని పతనానికి కారణం. ముఖ్యంగా బ్రిటన్, అమెరికాలోని బ్యాంకులు క్రెడిట్ కార్డుల ద్వారా బిట్ కాయిన్ల కొనుగోలుకు బ్రేక్ వేశాయి.
మన దేశంలోనూ బిట్ కాయిన్‌ను అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి కఠిన నిర్ణయాలు, చర్యలు ఈ డిజిటల్ కరెన్సీ విలువను తుడిచిపెట్టేస్తున్నాయి. సాంకేతికంగా చూస్తే బిట్ కాయిన్ విలువ 5,000 డాలర్ల వరకు క్షీణించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications