రోడ్డుపై గాల్లోకి లేచిన వాహనాలు, వీడియో హల్‌చల్
బీజింగ్: చైనాలో కార్లు గాలిలోకి లేచిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. చైనాలోని జింజిటాయ్‌లో ఓ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం నేపథ్యంలో... పలు వాహనాలు గాలిలోకి లేచాయి. ఈ ప్రమాదం బీజీ రోడ్డు పైన జరిగింది.
దీంతో, కొన్ని వాహనాలు గాలిలోకి లేచాయి. ఇది అక్కడే ఉన్న సిసిటివి కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగింది.

ఆ వీడియోలో... ఓ మినీ బస్సు హఠాత్తుగా గాలిలోకి లేచింది. పక్కకు జరిగింది. దీంతో, ఆ పక్కనే వస్తున్న మరో రెండు వాహనాలు గాలిలోకి లేచాయి.
నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డు పైన కార్లు అనుహ్యంగా ఎగిరిపోయి కిందపడ్డాయి. అమాంతం రెండు అడుగుల మేర పైకి లేచాయి. అయితే వాహనాలు గాలిలోకి ఎందుకు ఎగిరాయో కారణం తెలియడం లేదు. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.












Click it and Unblock the Notifications