సర్కారుతో కలిసివస్తాం: ఒబామా, స్వాగతించిన బిజెపి

న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత్‌లో రాబోయే కొత్త ప్రభుత్వానికి తాము అన్ని విధాలా సహకరిస్తామన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని బిజెపి గాలికి ఒబామా వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు.

రాబోయే తమ ప్రభుత్వానికి అమెరికాతోపాటు ప్రపంచ దేశాల సహకారం తప్పక లభిస్తుందని ఆయన తెలిపారు. సోమవారం భారతదేశంలో తుది దశ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో బరాక్ ఒబామా మాట్లాడుతూ.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిన ఘనత ప్రశంసనీయమన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసిన భారతీయులందరికీ ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

 BJP welcomes Obama's statement on working closely with new government

రాబోయే కొత్త ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని బరాక్ ఒబామా చెప్పారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరుదేశాలు (అమెరికా, భారత్) అభివృద్ధి పథంలో సాగుతూ.. తమ పౌరులకు భద్రతను కల్పిస్తూ సుసంపన్నంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సోమవారం భారతదేశంలో చివరి దశ లోకసభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం 66శాతంగా నమోదైంది. ఈ ఎన్నికల్లో సుమారు 50 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+