బిగ్‌బ్యాంగ్ కాదా: భారీ కృష్ణబిలం వల్లే విశ్వ ఆవిర్భావం

కెనెడా శాస్త్రవేత్తల ఈ వాదన బిగ్ బ్యాంగ్ థియరీకి పూర్తి భిన్నమైంది. ఓ భారీ నక్షత్రం కృష్ణబిలంలో కూలిపోయి పేలిపోవడం వల్లే ఈ విశ్వ ఆవిర్భావం జరిగిందని, ఎందుకంటే బిగ్ బ్యాంగ్ వల్లే విశ్వ ఆవిర్భావం జరిగి ఉంటే విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు లాంటివన్నీ కూడా ఇలా ఒకే రకంగా ఉండి ఉండేవి కావని శాస్తజ్ఞ్రులు అంటున్నారు.
అంతేకాదు అంత బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఒకే రకమైన ఉష్ణోగ్రతలు లాంటి వాటితో కూడిన విశ్వ ఆవిర్భావం ఎలా జరిగిందో చెప్పడం కూడా కష్టమేనని ఖగోళ శాస్తజ్ఞ్రులు అంటున్నారు.
భౌతిక శాస్తవ్రేత్త గియా డ్వాలితో కూడిన శాస్తజ్ఞ్రుల బృందం ఒకటి 2000 సంవత్సరంలో చేసిన ప్రతిపాదనపై ప్రధానంగా దృష్టిపెట్టి కెనడాలోని వాటర్‌లూలోని పెరిమీటర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ థియరేటికల్ ఫిజిక్స్‌కు చెందిన ఖగోళ భౌతిక శాస్తవ్రేత్తలు ఈ మేరకు ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసినట్లు సైన్స్ వెబ్‌పత్రిక ‘నేచర్ డాట్‌కామ్' వెల్లడించింది.












Click it and Unblock the Notifications