ట్రంప్ పై బ్లాక్స్ నిరసన : హోటల్ పై వ్యతిరేక నినాదాలు (వీడియో)
న్యూయార్క్ : అమెరికన్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై అక్కడి నల్లజాతి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్లజాతీయులను అణిచేసేలా సాగుతోన్న ట్రంప్ వివక్షపూరిత వైఖరికి నిరసనగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాషింగ్టన్ లోని ట్రంప్ హోటల్ పై దాడి చేశారు.
దాడి అనంతరం హోటల్ లోని గోడలపై ట్రంప్ కు వ్యతిరేకంగా పలు నినాద వాక్యాలు రాశారు. ట్రంప్ వైఖరి నల్లజాతీయులు జీవించడమే తప్పు అన్న తరహాలో ఉందని పేర్కొంటూ గోడలపై రాతలు రాశారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు వీడియో ఫుటేజీల్లో ఓ నల్లజాతీయుడిని గుర్తించారు. హోటల్ గోడలపై ట్రంప్ వ్యతిరేక నినాదాలు రాసి మెట్లు దిగి వెళుతోన్న నల్లజాతీయుడిని పోలీసులు ఫుటేజీల్లో గుర్తించారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలోను హల్ చల్ చేస్తుండగా.. భద్రతా రీత్యా హోటల్ పరిసరాల్లో సెక్యూరిటీని మరింత పటిష్టం చేశారు. కాగా, ట్రంప్ కు చెందిన ఈ హోటల్లో మొత్తం 236 గదులున్నాయి. అత్యంత లగ్జరీగా ఉండే ఈ భవనం అమెరికన్ అధ్యక్ష భవనం వైట్ హౌజ్ కు సమీపంలోనే ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే హోటల్లో ఒక్కరోజు బస చేసినందుకుగాను సుమారు వెయ్యి డాలర్లు వసూలు చేస్తారు. ప్రస్తుత అమెరికన్ ఎన్నికలకు సంబంధించి.. వాషింగ్టన్ వచ్చినప్పుడల్లా తన మద్దతుదారులతో మంతనాల కోసం కూడా ఇదే హోటల్ ను ఉపయోగించుకుంటున్నారు ట్రంప్.












Click it and Unblock the Notifications