Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"నల్లధనానికి చెక్!" అనే నినాదం వాస్తవమేనా?.. స్విస్ బ్యాంకుల్లో ఇంత డబ్బేంటి?

Swiss Bank: నల్లధనంపై పట్టు సాధిస్తున్నామని భారత సర్కారు ఎంతగా వాదించినా స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ధనం అమాంతం పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నివేదికల ప్రకారం.. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 2024లో మూడు రెట్లు పెరిగి సుమారు రూ.37,600 కోట్లకు చేరుకుంది. స్విస్ నేషనల్ బ్యాంకు(SNB) గణాంకాల ప్రకారం.. ఇది 2021 తర్వాత అత్యధికం. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ల విషయంలో భారత్ గత ఏడాది 67వ స్థానం నుంచి 48వ స్థానానికి ఎగబాకింది.

తగ్గిన పాకిస్థాన్ డిపాజిట్లు, పెరిగిన బంగ్లాదేశ్ డిపాజిట్లు
పాకిస్థాన్ డిపాజిట్లు భారీగా తగ్గాయి. అయితే బంగ్లాదేశ్ డిపాజిట్లు పెరిగాయి. పాకిస్తాన్ విషయానికి వస్తే స్విస్ నేషనల్ బ్యాంకులో దాని డిపాజిట్లు 272 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు తగ్గాయి. మరోవైపు బంగ్లాదేశ్ డిపాజిట్లు 589 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు పెరిగాయి.

Black Money Under Control Indian Deposits in Swiss Banks Tripled in 2024

అగ్రస్థానంలో బ్రిటన్, అమెరికా
బ్రిటన్ అత్యధికంగా 222 బిలియన్ స్విస్ ఫ్రాంకులను డిపాజిట్ చేసి అగ్రస్థానంలో ఉంది. అంటే ఎక్కువ డబ్బు బ్రిటన్‌దే జమ అయింది. అమెరికా 89 బిలియన్ ఫ్రాంకులతో రెండో స్థానంలో ఉంది. వెస్టిండీస్ 68 బిలియన్ డాలర్లు ఈ బ్యాంకులో జమ చేసింది.

పెరుగుదలకు కారణం ఏమిటి?
బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా ఎక్కువ డబ్బు రావడం వల్ల ఈ పెరుగుదల నమోదైంది. వ్యక్తిగత కస్టమర్ల డిపాజిట్లలో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంది. ఇది 11 శాతం పెరిగి 346 మిలియన్ల స్విస్ ఫ్రాంకులు(సుమారు రూ.3,675 కోట్లు) అయింది. అయితే వ్యక్తిగత కస్టమర్ల ద్వారా జమ చేసిన డబ్బులో పెద్దగా మార్పు లేదు.

2023లో 70 శాతం తగ్గుదల
2024తో పోలిస్తే 2023లో ఈ నిధులలో 70 శాతం తగ్గుదల నమోదైంది. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయికి అంటే 1.04 బిలియన్ ఫ్రాంకులకు చేరుకుంది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ 2006 రికార్డు అయిన 6.5 బిలియన్ల స్విస్ ఫ్రాంకుల కంటే తక్కువ. ఇది ఆర్థిక ప్రవాహాలు మళ్లీ ప్రారంభమయ్యాయని చూపిస్తోంది. మొత్తం 3.54 బిలియన్ల స్విస్ ఫ్రాంకులలో ఎక్కువ డబ్బు ఇతర బ్యాంకుల ద్వారా వచ్చింది. మిగిలిన డబ్బు కస్టమర్ ఖాతాలు, ట్రస్టులు, బాండ్స్ వంటి వాటి ద్వారా వచ్చాయి. అంటే భారత్ నుంటచి మళ్లీ స్విస్ బ్యాంకులకు వెళ్తోంది.

స్విస్ నేషనల్ బ్యాంక్ ఏం చెప్పిందంటే?
స్విస్ నేషనల్ బ్యాంక్ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో ఉంచిన ఆస్తులను నల్లధనంగా భావించకూడదని.. పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా భారత్‌కు యాక్టివ్‌గా సపోర్ట్ చేస్తామని స్విస్ అధికారులు వెల్లడించారు. అంటే, ఈ గణాంకాలు లెక్కల్లో లేని డబ్బును, తరచుగా 'నల్లధనం' అని పిలవబడే డబ్బును చూపించవు.భారతీయులు లేదా ఎన్నారైలు ఇతర దేశాల కంపెనీల ద్వారా ఉంచిన ఆస్తులు కూడా ఈ గణాంకాలలో చేర్చబడలేదని బ్యాంక్ తెలిపింది. పన్ను ఎగవేతను నిరోధించడంలో భారతదేశానికి సహాయం చేస్తామని స్విస్ అధికారులు పునరుద్ఘాటించారు. 2018 నుంచి ఆటోమేటిక్‌గా వివరాలను స్విట్జర్లాండ్, భారత్ పంచుకుంటున్నాయని చెప్పారు. స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న భారతీయుల వివరాలను 2019 సెప్టెంబర్‌లో మొదటిసారి భారత ట్యాక్స్ అధికారులకు స్విస్ అధికారులు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇది కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+