రంజాన్ వేళ ఘోరం.. నమాజ్ చేస్తుండగా మసీదులో పేలుడు.. ఎక్కడంటే?
Pakistan: బలూచిస్తాన్ లో రైలు హైజాక్ ఘటన, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో తాలిబన్ల దాడులతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ట్రైన్ హైజాక్ ఘటన, ఆత్మాహుతి దాడులు జరిగిన కొన్ని గంటల్లో పాకిస్థాన్ లో మరో దాడి జరిగింది. రంజాన్ వేళ వాయవ్య పాకిస్థాన్‌లోని శుక్రవారం పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్ లోని ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన పేలుడులో ఒక స్థానిక ఇస్లామిస్ట్ నాయకుడు, ఇద్దరు పిల్లలు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జామియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ (JUI-F) రాజకీయ పార్టీ స్థానిక నాయకుడు అబ్దుల్లా నదీమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం గాయపడిన అబ్దుల్ నదీమ్ ను ఆస్పత్రిలో చేర్చారు. స్థానిక మీడియా ప్రకారం.. అతని పరిస్థితి విషమంగా ఉంది. మౌలానా అబ్దుల్ అజీజ్ మసీదులో జరిగిన పేలుడులో గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని దక్షిణ వజీరిస్తాన్ జిల్లా పోలీసులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఎవరు బాధ్యులో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

పాకిస్థాన్ లోని నౌషెరా జిల్లాలోని దారుల్ ఉలూమ్ హక్కానియా సెమినరీ లక్ష్యంగా చేసుకుని ఆత్మాహతి దాడి జరిగిన ఒక నెలలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ మదర్సా ఆఫ్ఘన్ తాలిబన్లకు చారిత్రక శిక్షణా స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆత్మాహుతి దాడిలో జేయూఐడఎస్ నాయకుడు మౌలానా హమీదుల్ హక్ హక్కానీ తో పాటు ఐదుగురు మరణించగా.. 15 మంది గాయపడ్డారు. మరోవైపు పెరుగుతున్న ఉగ్రవాదంపై తన అణిచివేతను తీవ్రతరం చేస్తామని పాకిస్థాన్ ప్రతిజ్ఞ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించింది. పాలక ఆఫ్ఘన్ తాలిబన్ సర్కారు ఈ వాదనను తిరస్కరించింది.
A blast tore through a mosque on Friday in northwestern Pakistan, police said, injuring an Islamist party leader and three others, including children. Abdullah Nadeem, a local leader of the Jamiat Ulema Islam-Fazl (JUI-F) political party, was believed to be the target of the…
— ANI (@ANI) March 14, 2025
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications