ఆఫ్ఘన్ సుప్రీం కోర్టు సమీపంలో ఆత్మాహుతి దాడి: 12మంది మృతి
ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని సుప్రీం కోర్టు సమీపంలో మంగళవారం నాడు భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కూడా దీనిని నిర్ధారించారని సమాచారం.
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని సుప్రీం కోర్టు సమీపంలో మంగళవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకుంది. పోలీసులు కూడా దీనిని నిర్ధారించారు. ఈ పేలుడు కారణంగా 12 మంది మృతి చెందారు.
ఆత్మాహుతి దళానికి చెందిన సూసైడ్ బాంబర్... సుప్రీం కోర్టు ఉద్యోగులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కోర్టు పని వేళలు ముగిసిన తర్వాత అందరూ బయటకు వచ్చే సమయంలో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది.

సుప్రీం కోర్టు పార్కింగ్ ప్రాంతంలో ఈ చోటు చేసుకుందని సమాచారం. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాడి జరిగిన రహదారిని మూసివేశారు.












Click it and Unblock the Notifications